● వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్
ఖిలా వరంగల్: బడీడు పిల్లలను బడిలో చేర్పించాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ అన్నారు. గుంటూరుపల్లి ప్రాథమిక పాఠశాలలో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ వరంగల్, పోలీస్ కమిషనరేట్, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సంస్థ సంయుక్తంగా మామునూరు సబ్‌డివిజన్ ఏసీపీ వెంకటేష్, హెచ్‌ఎం విద్యాసాగర్ అధ్యక్షతన ఇటుక బట్టిల్లో పనిచేసే వలస కార్మికుల పిల్ల లకు విద్యా సామగ్రి, యూనిఫామ్‌ను సోమవారం పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి సీపీ సన్‌ప్రీత్ సింగ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ప్రతీ ఏడాది ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ అనే కార్యక్రమాలు పోలీస్, వివిధ ప్రభుత్వశాఖల సమన్వయంతో చేపడుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ ఎన్.రవి, ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ జె.శ్యాం సుందర్, ఎస్సైలు సుధాకర్, శ్రీకాంత్, గుంటూరుపల్లి సర్పంచ్ శ్రీకాంత్, ఉప సర్పంచ్ దండు నరేశ్, బత్తుల కరుణ, ఎర్ర శ్రీకాంత్, కుమ్మరి రవికుమార్, డాక్టర్ ఆనంద్, వసుధ, డీసీపీఓ ఉమ, శిరీష, తదితరులు పాల్గొన్నారు.


