ఖిలా వరంగల్ : మిల్స్‌కాలనీ పీఎస్ పరిధి కరీమాబాద్‌లో మూడు రోజుల క్రితం బాలిక, బాలుడు అదృశ్యమయ్యారు. స్నేహితురాలి ఇంటి వద్ద హోంవర్క్ చేసుకుని వస్తానని ఇంటి నుంచి వెళ్లిన బాలిక కనిపించకుండా పోయింది. దీంతో బాలిక తల్లి స్టేషన్‌లో ఫిర్యాదు చేయగా పోలీసులు కేసు నమో దు చేసి దర్యాప్తు ప్రారంభించారు. అయితే 48 గంటల దాటిన కేసులో పురోగతి లభించలేదని బాలిక కుటుంబీకులు కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు బాలిక ఆచూకీని కనిపెట్టాలని కోరుతూ సోమవా రం బాలుడిని సాకుతున్న వృద్ధురాలి ఇంటి ఎదుట ధర్నా చేపట్టారు. ఈవిషయం తెలిసిన మిల్స్‌కాలనీ ఎస్సై శ్రవణ్ కుమార్ వెంటనే ఘటనాస్థలికి చేరుకుని బాలిక కుటుంబీకులకు నచ్చజెప్పి ధర్నా విరమింపజేశారు. అనంతరం బాలుడి సాకిన వృద్ధురాలిని అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. కాగా, సదరు బాలిక.. బాలుడితో కలిసి వెళ్తున్న దృశ్యం సీసీ ఫుటేజీలో కనిపించింది. దీంతో మిస్సింగ్ కేసు కొంత మేరకు పురోగతి లభించినట్లు తెలుస్తోంది. తప్పిపోయిన బాలిక ఏపీలోని అనంతపురంలో ఉన్నట్లు విశ్వనీయ సమాచారం.


