కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’ | - | Sakshi
Sakshi News home page

కళానైపుణ్యాలను పెంచేది ‘రంగస్థలం’

Mar 31 2026 7:50 AM | Updated on Mar 31 2026 7:50 AM

రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు తిరుమలయ్య

హన్మకొండ కల్చరల్‌: కళాకారుల ప్రతిభను వె లికితీసి వ్యక్తిత్వం, కళానైపుణ్యాలను పెంచేది రంగస్థలమని రంగస్థల కళాకారుల ఐక్యవేదిక జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కాజీపేట తిరుమలయ్య అన్నారు. ఈ మేరకు సోమవారం రాత్రి వరంగల్‌లోని పోతనవిజ్ఞానపీఠంలో రెండురోజుల పాటు జరిగే పీఠం వార్షికోత్సవ వేడుకలను ప్రారంభించారు. ఈ సందర్భంగా గందె శ్రీనివాస్‌ అధ్యక్షతన జరిగిన సభలో ముఖ్యఅతిథిగా తిరుమలయ్య, విశిష్ట అతిథిగా కేయూ విశ్రాంతాచార్యుడు బన్న అయిలయ్య, యేర కోటేశ్వరరావు, నేరెళ్ల శోభావతి, పీఠం మేనేజర్‌ జేఎన్‌ శర్మ పాల్గొని మాట్లాడారు. అనంతరం రంగస్థల కళాకారులను సన్మానించారు. మయూరి ఆర్ట్స్‌ క్రియేషన్స్‌ వరంగల్‌ ప్రదర్శించిన ‘వివాహబంధం’ నాటిక అలరించింది. ఈ నాటికలో మాడిశెట్టి రమేశ్‌, సాదుల సురేశ్‌, కొడం సురేందర్‌, వేముల ప్రభాకర్‌, ఆకుతోట లక్ష్మణ్‌ నటించారు. సురభి సంతోష్‌ రగాలంకరణ చేయగా, సంగీతం పాక సృజన్‌ అందించారు. పీఠం కార్యవర్గ సభ్యులు నాగరాజు, శ్రీధర్‌, కళాకారులు, తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement