వరంగల్ స్పోర్ట్స్: రాష్ట్రంలోని క్రీడా పాఠశాలల్లో ప్రవేశాలకు జిల్లాస్థాయి ఎంపికలను సోమవారం హనుమకొండలోని జవహర్‌లాల్ నెహ్రూ స్టేడియంలో నిర్వహించారు. జిల్లా క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఒలింపిక్స్ సంఘం జిల్లా అధ్యక్షుడు అజీజ్‌ఖాన్ ముఖ్యఅతిథిగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాల్యం నుంచే క్రీడల్లో శిక్షణ అందిస్తే బంగారు భవిష్యత్ సొంతమవుతుందన్నారు. క్రీడా పాఠశాలల్లో అభ్యసించే విద్యార్థులకు చదువు, క్రీడలు సమానంగా అందుతాయ న్నారు. రెండు రోజులపాటు జరిగే ఎంపికల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేయనున్నట్లు ఇన్‌చార్జ్ డీవైఎస్‌ఓ శ్రీమన్నారాయణ తెలిపారు. కార్యక్రమంలో డీఎస్‌ఏ కోచ్‌లు నరేందర్, విష్ణువర్ధన్, శంకర్, రాజు, ప్రభుదాస్, అఫ్జల్ తదితరులు పాల్గొన్నారు.
పోక్సో కేసులో నేరస్తుడికి
20 ఏళ్ల జైలు
వరంగల్ లీగల్ : ప్రేమిస్తున్నానని .. పెళ్లి చేసుకుంటానని నమ్మించి బాలికను గర్భవతిని చేసి పెళ్లి చేసుకోవడానికి నిరాకరించిన ఘటనలో నేరం రు జువుకావడంతో హనుమకొండ దీన్‌దయాళ్‌నగర్ జేపీనగర్‌కు చెందిన వల్లెపు రాజుకు 20 సంవత్సరా ల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధి స్తూ హనుమకొండ జిల్లా మొదటి అదనపు కోర్టు (పోక్సో కోర్టు) జడ్జి బి.అపర్ణాదేవి సోమవారం తీర్పు వెలువరించారు. పీపీ బి.రాజమల్లారెడ్డి కథ నం ప్రకారం.. సూర్యాపేట జిల్లాకు చెందిన బాలిక తల్లిదండ్రులు మృతి చెందడంతో హనుమకొండలోని తన చిన్నమ్మ ఇంటి వద్ద ఉంటుంది. అదే ప్రాంతానికి చెందిన వల్లెపు రాజు సదరు బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించి లోబర్చుకున్నాడు. కొద్ది కాలానికి అనారోగ్యంగా ఉ న్న బాలికను ఆమె చిన్నమ్మ, చినాన్న ఆస్పత్రికి తీసుకెళ్లగా గర్భవతి అని నిర్ధారణ అయ్యింది. రా జుతో కొనసాగుతున్న సంబంధాన్ని సదరు బాలిక తెలిపింది. దీంతో చిన్నమ్మ, చినాన్న పెద్దల సమక్షంలో బాలికను వివాహం చేసుకోమని అడగగా తనకు ఎలాంటి సంబంధం లేదని, ఒత్తిడి చేస్తే చంపేస్తానని రాజు బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈ ఘటన పై 2022, ఆగస్టు 8న సుబేదారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. విచారణలో నేరం రుజు వుకావడంతో నేరస్తుడు వల్లెపు రాజుకు 20 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.2 వేల జరిమానా విధిస్తూ జడ్జి అపర్ణాదేవి తీర్పు వెలువరించారు. కేసును ఏసీపీ వి.కిరణ్‌కుమార్, సీఐ ఎం.రంజిత్‌కుమార్ పరిశోధించగా లైజన్ ఆఫీసర్లు పి.కొమురయ్య, కె.పరమేశ్వరి, భరోసా న్యాయాధికారి నీర జ పర్యవేక్షణలో హెడ్ కానిస్టేబుల్ ఎం.చందర్ సా క్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. బాధితుల పరిహా రం చెల్లింపు పథకం కింద బాలికకు రూ.2 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పులో పేర్కొన్నారు.


