ప్రైవేట్‌ సంస్థలను తరిమికొడతాం | - | Sakshi
Sakshi News home page

ప్రైవేట్‌ సంస్థలను తరిమికొడతాం

Mar 31 2026 7:50 AM | Updated on Mar 31 2026 7:50 AM

హన్మకొండ: ఆర్టీసీ డిపోల నుంచి ప్రైవేట్‌ సంస్థలను పంపించకపోతే తామే తరిమికొడతామని.. ఆ రోజు తప్పక వస్తుందని టీజీఎస్‌ ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌ ఈదురు వెంకన్న అన్నారు. ఆర్టీసీ డిపోలను ప్రైవేట్‌కు అప్పగించడాన్ని వ్యతిరేకిస్తూ, విద్యుత్‌ బస్సులను ఆర్టీసీకి ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సోమవారం హనుమకొండలోని వరంగల్‌–2 డిపో ఎదుట ఆర్టీసీ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగులు అర్ధనగ్న ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకన్న మాట్లాడుతూ ప్రభుత్వం ఎలక్ట్రిక్‌ బస్సుల పేరుతో ఆర్టీసీని ప్రైవేట్‌ పరం చేయాలని చూస్తోందని విమర్శించారు. ప్రభుత్వరంగ రవాణ సంస్థలుండగా కేంద్ర ప్రభుత్వం విద్యుత్‌ బస్సులను ప్రైవేట్‌కు అప్పగించడంలో అర్థం లేదన్నారు. ప్రైవేట్‌ సంస్థలకు రాయితీ లబ్ధి చేకూర్చడానికే ఈ విధానం అవలంబిస్తుందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికై నా తన విధానాలను మార్చుకుని ఆర్టీసీలకే విద్యుత్‌ బస్సులు కొనుగోలు చేసి అప్పగించాలన్నారు. వరంగల్‌ రీజియన్‌ జేఏసీ నాయకులు ఎం.శ్రీనివాస్‌, సీహెచ్‌ యాకస్వామి, జీఎస్‌ పాణి, తోట శ్రీనివాస్‌, రంగు శ్రీధర్‌, సుధాకర్‌, మండ రాజు, పోతరాజు రమేశ్‌, ఎం.రవీందర్‌, పి.రాజయ్య, రంజిత్‌, అన్ని, విజయ, రోజ, సుమలత, సులోచన, సుల్తానా, దయాకర్‌, బుచ్చయ్య, బి.ఎన్‌.రాములు, తదితరులు పాల్గొన్నారు.

ఆర్టీసీ జేఏసీ రాష్ట్ర చైర్మన్‌

ఈదురు వెంకన్న

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement