సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు | - | Sakshi
Sakshi News home page

సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

Mar 21 2026 5:59 AM | Updated on Mar 21 2026 5:59 AM

సంక్షేమ పథకాల అమలులో నిర్లక్ష్యం వద్దు

హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌

హన్మకొండ అర్బన్‌: జిల్లాలో మహిళా, శిశు, దివ్యాంగులు, వృద్ధుల సంక్షేమానికి సంబంధించిన పథకాలు పటిష్టంగా అమలు కావాలని, ఎలాంటి నిర్లక్ష్యం వహించినా సహించేది లేదని హనుమకొండ కలెక్టర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌ అధికారులను ఆదేశించారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళా శిశు సంక్షేమ శాఖ పనితీరుపై సమీక్ష నిర్వహించారు. అంగన్‌వాడీ కేంద్రాలు, గర్భిణులు, బాలింతలు, చిన్నారుల పోషణ, పోషణ్‌ అభియాన్‌, అక్షయపాత్ర భోజనం, ‘బేటీ బచావో.. బేటీ పడావో’ వంటి కార్యక్రమాల అమలుపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. సమావేశంలో సీడీపీఓలు స్వరూప, ఉమా, ఎక్స్‌టెన్షన్‌ ఆఫీసర్‌ సింధురాణి, ఇన్‌చార్జ్‌ డీసీపీఓ ప్రవీణ్‌ కుమార్‌, ఎఫ్‌ఆర్‌ఓ రవికృష్ణ, సఖి కేంద్రం అడ్మిన్‌ హైమావతి, శిశు గృహ మేనేజర్‌ మాధవి, చైల్డ్‌ లైన్‌ కో–ఆర్డినేటర్‌ భాస్కర్‌, డీహెచ్‌డబ్ల్యూ కో–ఆర్డినేటర్‌ కళ్యాణి, ఐసీడీఎస్‌ సూపర్‌వైజర్లు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement