హైటెక్ మేడారం..
ముఖ్యమైన ఫోన్‌నంబర్లు..
ఇంకా టెక్ సేవలు
ఏం ఉన్నాయంటే..
శాశ్వత కట్టడాలతో ఇప్పటికే మహాజాతరకు కొత్త రూపు
సాక్షి, వరంగల్: మేడారం మహా జాతర హైటెక్ హంగులు అద్దుకుంటోంది. ఇప్పటికే సమ్మక్క–సారలమ్మ, పగిడిద్దరాజు, గోవిందరాజుల గద్దెలను ఒకే వరుసలోకి తీసుకొచ్చారు. గ్రానైట్ రాతితో శిలాతోరణాలు, ఆదివాసీ సంస్కృతీసంప్రదాయాలు, ఆచారాలు, గొట్టుగోత్రాలు, చరిత్రను తెలిపేలా 32 గ్రానైట్ స్తంభాల రూపకల్పనతో సరికొత్తగా దర్శనమిస్తోంది. ఇంకోవైపు వాహన రాకపోకలు, పార్కింగ్, వైద్య శిబిరాలు, నీటి వసతులు, క్యాంపులు, తప్పిపోయిన వారి ఆచూకీ, అంబులెన్స్‌లు, చలివేంద్రాలు.. ఇలా భక్తులకు ఎక్కడెక్కడ ఏ సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయనే విషయాలు అరచేతిలోనే కనిపించేలా ‘మేడారం జాతర యాప్’ను అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే, జాతరకు ఎన్ని వాహనాలు వచ్చాయి, పార్కింగ్‌లో ఎన్ని వాహనాలు ఉన్నాయి, ఇంకా ఎన్ని వాహనాలకు ఆస్కారముందనే పక్కా లెక్కల కోసం స్మార్ట్ అనలిటిక్స్, ఆటోమేటిక్ నంబర్ ప్లేట్ రికగ్నేజేషన్ వ్యవస్థను అనుసంధానం చేసి ట్రాఫిక్‌పై ఫోకస్ చేశారు. ముఖ్యంగా డ్రోన్లతో పాటు హీలియం బెలూన్లకు అమర్చిన పాన్‌టిల్ట్ జూమ్ కెమెరాల సహకారం తీసుకొని ఏఐ టెక్నాలజీతో ట్రాఫిక్‌ను నియంత్రిస్తున్నారు. మెరుగైన మొబైల్ నెట్‌వర్క్ కోసం 27 శాశ్వత సెల్‌టవర్లు, 33 వీల్‌సెల్ టవర్లు అందుబాటులో ఉంచారు. ఇలా మేడారం జాతర సాఫీగా నిర్వహించేందుకు హైటెక్ సాయంతో అధికారులు ముందుకెళ్తున్నారు.
హెల్ప్‌డెస్క్ ఫీచర్‌లో
ల్యాండ్‌లైన్ కాల్ సెంటర్ : 08717–243055,
మాస్టర్ కంట్రోల్ రూం : 94919 35321, 9493416719, 7382760241, 73829 06844, టీజీఆర్టీసీ హెల్ప్ డెస్క్ : 99592 26056, 99592 26049
మేడారం భక్తుల సౌకర్యార్థం రాష్ట్ర ప్రభుత్వం తొలిసారిగా వాట్సాప్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చింది. భక్తులు 76589 12300 నంబర్‌కు హాయ్ అని మెసేజ్ పంపితే జాతర రూట్ మ్యాప్, ట్రాఫిక్ అప్‌డేట్స్, పార్కింగ్, వైద్య కేంద్రాలు, స్నానఘట్టాలు తదితర సమాచారం నేరుగా వాట్సాప్‌లో లభించ నుంది.
హనుమకొండలోని ఆర్ట్స్ కళాశాల మైదానం నుంచి మేడారం వరకు హెలికాప్టర్ సేవలు అందుబాటులో ఉన్నాయి. ఈ నెల 24 నుంచి 31 వరకు బుకింగ్ చేసుకునే రానుపోను ఒకరికి రూ.35,999 చార్జీ ఉంటుంది. ఉదయం 8 నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు సేవలు అందుబాటులో ఉంటాయి. టికెట్ బుకింగ్ కోసం 96763 20139, 85300 04309, 76609 39509 నంబర్లలో సంప్రదించాలి. అలాగే, మేడారం జాతరలో ఆరు నుంచి ఏడు నిమిషాల జాయ్ హెలికాప్టర్ రైడ్ కోసం ఒక్కరికి రూ.4,800 చార్జీ నిర్ణయించారు.
ఆటోమేటిక్ నంబర్ ప్లేట్
రికగ్నైజేషన్‌తో వాహనాల లెక్కింపు
డ్రోన్లకు అమర్చిన కెమెరాల
దృశ్యాలతో పార్కింగ్‌పై క్లారిటీ
76589 12300 వాట్సాప్
నంబర్‌కు హాయ్ అని టైప్ చేస్తే
సమాచారం
ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లో
అందుబాటులో మేడారం జాతర యాప్
హైటెక్ మేడారం..


