 
															ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ
వరంగల్ క్రైం: పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని పురస్కరించుకుని బుధవారం నిర్వహించిన సైకిల్ ర్యాలీ ఉత్సహంగా సాగింది. ఈర్యాలీలో వరంగల్ పోలీస్ కమిషనర్‌తో పాటు గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి, ఈస్ట్ జోన్ డీసీపీ అంకిత్ కుమార్ పాల్గొన్నారు. ఈర్యాలీని అదనపు డీసీపీలు రవి, సురేశ్‌కుమార్ పచ్చ జెండా ఊపి ప్రారంభించారు. పోలీస్ కమిషనరేట్ కార్యాలయం నుంచి అంబేడ్కర్ సెంటర్, అదాలత్ సెంటర్, హనుమకొండ కలెక్టరేట్ నుంచి తిరిగి ఇదే మార్గం నుంచి నక్కలగుట్ట మీదుగా పొలీస్ కమిషనరేట్ కార్యాలయానికి చేరుకుంది. ఈర్యాలీ వరంగల్ పోలీస్ కమిషనర్ సైక్లింగ్ రైడర్స్‌తో కలిసి పోలీస్ అమరవీరులకు జోహార్లు నినాదాలు చేస్తూ రైడర్స్‌ను ఉత్సాహపర్చారు. అనంతరం ర్యాలీ పాల్గొన్న సైకిల్ రైడర్లకు పోలీస్ అధికారుల చేతుల మీదుగా సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ర్యాలీలో అదనపు డీసీపీలు, శ్రీనివాస్, ప్రభాకర్, బాలస్వామి, ఏఎస్పీ శుభం, ఏసీపీలు జితేందర్‌రెడ్డి, నర్సింహారావు, అనంతయ్య, నాగయ్య, సత్యనారాయణ, ఇన్‌స్పెక్టర్లు, ఆర్‌ఐలు, ఏజే పెడల్స్ యాజమాన్యం, ట్రై సిటీ సై కిల్ రైడర్స్, పబ్లిక్ గార్డెన్స్ వాకర్స్ అసోసియేషన్ స భ్యులు, నిట్ విద్యార్థులు, సిబ్బంది ఉన్నారు.
 
							ఉత్సాహంగా సైకిల్ ర్యాలీ

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
