 
															వర్షంలో చిక్కుకున్న పెళ్లి బృందం
హన్మకొండ అర్బన్/కాజీపేట అర్బన్: పెళ్లికి విచ్చేసిన బంధుమిత్రులు ఒక్కసారిగా ముంచెత్తిన వర్షంలో చిక్కుకున్న ఘటన హనుమకొండ జిల్లా కేంద్రంలో బుధవారం జరిగింది. హనుమకొండ తహసీల్దార్ రవీందర్‌రెడ్డి కథనం ప్రకారం.. హనుమకొండకు చెందిన వారి పెళ్లిని అంబేడ్కర్ భవన్‌లో చేసేందుకు కుటుంబ పెద్దలు నిర్ణయించారు. వివాహానికి బంధుమిత్రులు, కుటుంబ సభ్యులు సుమారు 500 మంది హాజరయ్యారు. ఉదయం 11 గంటలకు వివాహం ఘనంగా పూర్తి అయ్యింది. వివాహ అనంతరంలో విందులో పాల్గొన్నారు. సుమారు మధ్యాహ్నం 2 గంటల ప్రాంతంలో అంబేడ్కర్ భవన్ ప్రాంతం జలదిగ్బంధంలో చిక్కుకుపోయింది. దీంతో 250 మంది వర్షపు నీటిలో చిక్కుకుపోయారు. సుబేదారి ఇన్‌స్పెక్టర్ రంజిత్, ఆర్‌ఐ దశరథరామిరెడ్డి కలిసి రెండు ట్రాక్టర్లలో పెళ్లి బృందాన్ని సురక్షితంగా తరలించినట్లు తహసీల్దార్ తెలిపారు. దీంతో పెళ్లి బృందం ఊపిరి పీల్చుకుని తహసీల్దార్, ఇన్‌స్పెక్టర్, ఆర్‌ఐకి కృతజ్ఞతలు తెలిపింది.
ట్రాక్టర్లలో సురక్షితంగా తరలించిన అధికారులు

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
