 
															గుండ్రాతిమడుగు రైల్వే స్టేషన్‌లో కోణార్క్ ఎక్స్‌ప్రెస
కురవి: మోంథా తుపాన్‌తో కోణార్క్ ఎక్స్‌ప్రెస్ రైలు బుధవారం ఉదయం కురవి మండలంలోని గుండ్రాతిమడుగు రైల్వేస్టేషన్‌లో నిలిచింది. దీంతో మధ్యాహ్నం వరకు ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. మహబూబాబాద్ రూరల్ సీఐ సర్వయ్య, కురవి ఎస్సై జయకుమార్, కానిస్టేబుళ్లు కాశీరాం, భద్రు, అశోక్.. ప్రయాణికులకు వాటర్ బాటిళ్లు, అరటిపండ్లు అందజేశారు. కాగా, ప్రయాణికులకు గార్లబయ్యారం సీఐ రవికుమార్, బయ్యారం రెండో ఎస్సై మహబూబీతోపాటు బయ్యారం మండల కేంద్రానికి చెందిన యువకులు రూ.50వేల విలువైన అరటి పండ్లు, బ్రెడ్, వాటర్ బాటిళ్లు, బిస్కెట్ ప్యాకెట్లు, టిఫిన్లు అందజేశారు.

 
  
                                                     
                                                     
                                                     
                                                     
                                                     
                         
                         
                         
                         
                        
