అధికారులు అప్రమత్తంగా ఉండాలి
హన్మకొండ : రాష్ట్రంలో రానున్న రెండ్రోజులు భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరిక నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులంతా అప్రమత్తంగా ఉండాలని టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్నా టి వరుణ్‌రెడ్డి ఆదేశించారు. సోమవారం హనుమకొండ నక్కలగుట్టలోని ఎన్పీడీసీఎల్ కార్యాలయం నుంచి 16 సర్కిళ్ల ఎస్‌ఈలు, డీఈలతో వరుణ్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎండీ వరుణ్‌రెడ్డి మాట్లాడుతూ.. ఖమ్మం, కొత్తగూడెం, భూపాలపల్లి, ములుగు, మహబూబాబాద్ ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ సూచనలు చేసింది. ఈ నేపథ్యంలో ఎక్కడైనా విద్యుత్ సమస్యలు ఏర్పడితే వెంటనే పునరుద్ధరించాలని, మెటీరియల్ సిద్ధంగా ఉంచుకోవాలని ఆదేశించారు. 24/7 సిబ్బంది అందుబాటులో ఉండాలని, ఏజెన్సీలు, బ్రేక్ డౌన్ టీంలు రెడీగా ఉండేలా ఏర్పాట్లు చేసుకోవాలన్నారు. ఔత్సాహికులు ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు ఏర్పాటుకు కావాల్సిన అనుమతులు తీసుకోవా లన్నారు. సమావేశంలో డైరెక్టర్లు మోహన్‌రా వు, మధుసూదన్, సీఈలు రాజు చౌహాన్, వెంకటరమణ, జీఎంలు అన్నపూర్ణ, శ్రీనివాస్, శ్రీకాంత్, డీఈ లు అనిల్ కుమార్, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్‌రెడ్డి


