కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ, హనుమకొండ ప్రకాశ్‌రెడ్డిపేటలోని ప్రొఫెసర్ గజ్జెల రామేశ్వరం ఇంటర్నేషనల్ నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్ మధ్య అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదిరింది. ఈ మేరకు సోమవారం క్యాంపస్‌లోని అకడమిక్ కమిటీహాల్‌లో వీసీ కె. ప్రతాప్‌రెడ్డి సమక్షంలో రిజిస్ట్రార్ వి. రామచంద్రం, ఆ రీసెర్చ్ సెంటర్ వ్యవస్థాపకుడు గజ్జెల రామేశ్వరం అవగాహన ఒప్పంద పత్రాలపై సంతకాలు చేశారు.
ఈ సందర్భగా రిజిస్ట్రార్ వి. రామచంద్రం మాట్లాడుతూ నేచురోపతి లైబ్రరీ అండ్ రీసెర్చ్ సెంటర్‌తో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్న దేశంలోని తొలి యూనివర్సిటీ కేయూ అన్నారు. ఈ ఒప్పందం ద్వారా కేయూలోని లైబ్రరీ సైన్స్, ఆర్ట్స్, లైఫ్ సైన్సెస్, ఫిజికల్ ఎడ్యుకేషన్, యోగా, సోషల్ సైన్స్ వంటి విభాగాల్లో పరిశోధనలకు ఈ రీసెర్చ్ సెంటర్‌తో విస్తృత అవకాశాలు కలుగుతాయని తెలిపారు. సైన్స్ విభాగాల డీన్ జి. హనుమంతు, పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, ప్రిన్సిపాల్ టి. మనోహర్, ఫార్మసీ కళాశాల డీన్ గాదె సమ్మయ్య, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కోల శంకర్ తదితరులు పాల్గొన్నారు.
8 నుంచి ఫార్మా ‘డీ’ ఫస్టియర్ పరీక్షలు
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ పరిఽధిలోని ఫార్మా ‘డీ’ ఫస్టియర్ రెగ్యులర్, ఎక్స్ అండ్ ఇంప్రూవ్‌మెంట్ పరీక్షలు ఈనెల 8వ తేదీనుంచి నిర్వహించనున్నట్లు కేయూ పరీక్షల నియంత్రణాధికారి కె. రాజేందర్, అదనపు పరీక్షల నియంత్రణాఽధికారి ఆసిం ఇక్బాల్ సోమవారం తెలిపారు. ఈనెల 8, 10, 12, 15, 17, 19 తేదీల్లో మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5గంటల వరకు నిర్వహిస్తామని వారు తెలిపారు.
రేపు స్పోర్ట్స్‌బోర్డుసర్వసభ్య సమావేశం
కేయూ క్యాంపస్: కాకతీయ యూనివర్సిటీ స్పోర్ట్స్‌బోర్డు సర్వసభ్య సమావేశం ఈనెల 3వ తేదీన( రేపు)ఉదయం 11గంటలకు యూనివర్సిటీలోని సెనేట్‌హాల్‌లో నిర్వహించనున్నట్లు స్పోర్ట్స్‌బోర్డు సెక్రటరీ వై. వెంకయ్య సోమవారం తెలిపారు. ఇందులో కేయూ పరిధిలోని ఉమ్మడి వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్ జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ అనుబంధ కళాశాలల వ్యాయామ విభాగపు ఫిజికల్ డైరెక్టర్లు పాల్గొంటారని తెలిపారు. 2025–2026 విద్యాసంవత్సరానికి సంబంధించి క్రీడలు, అథ్లెటిక్స్ నిర్వహణకు సంబంధించిన క్యాలెండర్‌ను రూపొందించి చర్చిస్తారని తెలిపారు. వీసీ కె. ప్రతాప్‌రెడ్డి, రిజిస్ట్రార్ వి. రామచంద్రం,యూనివర్సిటీ కాలేజీ ప్రిన్సిపాల్ టి. మనోహర్ , కేయూ ఫైనాన్స్ ఆఫీసర్ హబీబుద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొంటారని వెంకయ్య తెలిపారు.

నేచురోపతి లైబ్రరీ రీసెర్చ్ సెంటర్, కేయూ మధ్య ఎంఓయూ