
ప్రకృతి ఒడిలో పోలీస్ స్టేషన్..
ఖిలా వరంగల్ : పోలీసు స్టేషన్ అనగానే వివిధ కేసులు, నిందితులు, సామాన్యులు ఎవరైనా అడుగు పెట్టాలంటే భయపడతారు. దీనికి భిన్నంగా మామునూరు పోలీస్ స్టేషన్‌లోకి అడుగు పెట్టగానే పచ్చదనం కనువిందు చేస్తోంది. మొక్కలు సాదరంగా స్వాగతం పలుకుతాయి. గతంలో ఇక్కడ పనిచేసిన ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, సిబ్బంది.. ప్రస్తుత ఇన్‌స్పెక్టర్ వరకు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని స్టేషన్ ఆవరణలో గ్రీనరీ, అందమైన పూల మొక్కలు, ఔషధ మొక్కలు నాటించి సంరక్షణ చర్యలు చేపట్టారు. సువిశాలమైన పచ్చిక మైదానంతో ఆవరణంతా నందనవనంలా దర్శనమిస్తోంది.
రక్షణ, ఆహ్లాదం కల్పిస్తున్నాం.
ప్రజలకు రక్షణ కల్పిస్తూనే ఫిర్యాదుదా రులు సేదదీరేందుకు ఆహ్లాద వాతావరణం కల్పిస్తున్నాం. స్టేషన్ అనగానే భయం ఉంటుంది. కానీ, ఎవరైనా స్టేషన్ ఆవరణలో అడుగుపెట్టగానే పచ్చదనం స్వాగతం పలికేలా చేశాం. చెట్ల నీడన కాసేపు ప్రశాంతంగా కూర్చునేలా సిమెంట్ బల్లాలు వేశాం. – వెంకటేష్

ప్రకృతి ఒడిలో పోలీస్ స్టేషన్..