
అర్జీలు త్వరగా పరిష్కరించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: ప్రజావాణిలో ప్రజల నుంచి స్వీకరించిన అర్జీలు త్వరగా పరిష్కరించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణిలో కలెక్టర్ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. అర్జీల పరిష్కారంలో అలసత్వం వహించవద్దని, సత్వరమే పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ప్రజావాణిలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ 23, ఆర్డీఓ హనుమకొండ 20, ఆర్డీఓ పరకాల 11, పీడీ హౌసింగ్ 18తో పాటు వివిధ శాఖలకు చెందిన మొత్తం 206 అర్జీలు స్వీకరించినట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వై.వి గణేశ్, డీఆర్డీఓ పీడీ మేన శ్రీను, హనుమకొండ, పరకాల ఆర్డీఓలు రాథోడ్ రమేశ్, కె.నారాయణ, అధికారులు పాల్గొన్నారు.
దరఖాస్తులు త్వరగా పరిష్కరించాలి:
వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: ప్రజావాణికి వచ్చిన అర్జీలను త్వరగా పరిష్కరించాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. వరంగల్ కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన ప్రజావాణి అదనపు కలెక్టర్ సంధ్యారాణి, జెడ్పీ సీఈఓ రాంరెడ్డి, డీఆర్డీఓ కౌసల్యాదేవి, ఆర్డీఓలు సత్యపాల్‌రెడ్డి, ఉమారాణి, హౌసింగ్ పీడీ గణపతి ఇతర అధికారులతో కలిసి కలెక్టర్ దరఖాస్తులు స్వీకరించారు. మొత్తం 150 దరఖాస్తులు రాగా.. ఎక్కువగా రెవెన్యూశాఖకు సంబంధించినవి 58 ఉన్నాయి. పీడీ హౌసింగ్ 25, జీడబ్ల్యూఎంసీ 13 దరఖాస్తులు రాగా వివిధ శాఖలకు సంబంధించి 54 దరఖాస్తులు స్వీకరించామని కలెక్టర్ తెలిపారు. కార్యక్రమంలో అ ధికారులు అనురాధ, నీరజ, పుష్పలత, విశ్వప్రసా ద్, తహసీల్దార్లు ఇక్బాల్, నాగేశ్వర్‌రావు ఉన్నారు.

అర్జీలు త్వరగా పరిష్కరించాలి