
ప్రకృతి ప్రేమికుడు రామస్వామి
హన్మకొండ: మొక్కలు నాటడంతో అవి నిలదొక్కుకునే వరకు వాటి సంరక్షణను చూసుకుంటున్నాడు ప్రకృతి ప్రేమికుడు తాళ్లపల్లి రామస్వామి. హనుమకొండ పోస్టల్ కాలనీకి చెందిన తాళ్లపల్లి రామస్వామి పోలీసు శాఖలో కార్యాలయం సూపరింటెండెంట్‌గా రిటైర్డ్ అయ్యారు. ప్రకృతి అంటే ఇష్టమున్న రామస్వామి ఇప్పటి వరకు దాదాపు 10వేల మొక్కలు నాటారు. 80 ఏళ్లకు పై బడిన వయస్సులో ఉన్న ఆయన ఎంత దూరమైనా వెళ్లి తను నాటిన మొక్కల బాగోగులు చూసి వస్తాడు. తనకు ప్రకృతి, జీవరాశులు అంటే వల్లమాలిన ప్రేమ అని రామస్వామి తెలిపారు. పండ్ల మొక్కలు నాటి వాటిని సంరక్షిస్తే పక్షులు, జంతువులకు, ఇతర జీవులకు ఆహారం దొరుకుతుందని అంటున్నారు. మొక్కలు పెంచడం ద్వారా పర్యావరణాన్ని పరిరక్షించిన వారమవుతామని తెలిపారు.