
ఒకరైతేనే న్యాయం చేయగలమని..
హన్మకొండ కల్చరల్: బోల్లోజు నైమిష సాఫ్ట్‌వేర్ ఇంజనీర్. ఆమె భర్త హైదరాబాద్‌లో పోలీస్ కానిస్టేబుల్‌గా (క్రైమ్) ఉద్యోగం చేస్తున్నారు. వారికి ఒక పాప చైత్విక. భర్త ప్రభుత్వ ఉద్యోగమైనప్పటికీ, తాను ఉద్యోగం చేస్తున్నా ఒక్కరే సంతానం చాలనుకున్నారు. అత్తమామలు వయస్సులో పెద్దవారు కావడం, దంపతులిద్దరూ ఉద్యోగస్తులు కావడంతో మరో సంతానాన్ని చూసుకోవడం కష్టమవుతుందని అంటున్నారు. రాబోయే రోజుల్లో వారి పిల్లలకు చదువుకోసం ఖర్చులే కాక వారికి కొంత డబ్బును సంపాదించి ఇవ్వాలని తెలిపారు. అందుకు ఇద్దరు సంతానం ఉంటే వారికి సరైన న్యాయం చేయలేమేమోనని ఒకరితో సరిపెట్టుకున్నారు.