
మనస్తాపంతో వ్యక్తి ఆత్మహత్య
ఖిలా వరంగల్: అనారోగ్య సమస్యలతో మనస్తాపం చెందిన ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసుల కథనం ప్రకారం.. ఖిలా వరంగల్ మధ్యకోట యాదవవాడకు చెందిన వేల్పుల సంతోశ్ యాదవ్(56) వ్యవసాయ మార్కెట్‌లో వ్యాపా రం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇటీవల యూరిక్ యాసిడ్ లెవల్ పెరగడంతో అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఆదివారం ఈ సమస్య ఎక్కువ కావడంతో మనస్తాపానికి గురయ్యాడు. సోమవారం తెల్లవారుజామున ఇంటి ప్రాంగణంలో ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఉదయం కుటుంబీకులు గమనించి మిల్స్‌కాలనీ పోలీసులకు సమాచారం అందజేయగా వారు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతుడి భార్య అరుణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.