
మార్కెట్లను ఆధునికీకరించాలి
వరంగల్ అర్బన్/కాజీపేట రూరల్: కూరగాయలు, పండ్లు, చేపలు, ఇతర వస్తువులు మార్కెట్లలో అందుబాటులో ఉండేలా ఆధునికీకరించి, వినియోగంలోకి తీసుకురావాలని గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అధికారులను ఆదేశించారు. బుధవారం కాజీపేట, హనుమకొండ బాలసముద్రంలోని కూరగాయల మార్కెట్, బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత విద్యుత్ ప్లాంట్‌ను కమిషనర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈసందర్భంగా కాజీపేట, బాలసముద్రం మార్కెట్లకు సంబంధించి వెజ్, నాన్‌వెజ్ ఇంటిగ్రేటెడ్ మార్కెట్ నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేయాలని ఇంజనీర్లను హెచ్చరించారు. ఆయా మార్కెట్లలో కూరగాయల విక్రయాలు జరి గేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. మార్కెట్లలో, ఇళ్లల్లో వెలువడుతున్న చెత్తను బయోగ్యాస్ విద్యుత్ ఆధారిత ప్లాంట్లకు తరలించా లని సూచించారు. ఆయా ప్రాంతాల్లో విద్యుత్ ఉత్పత్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలోని ప్లాంట్‌ను పూర్తి స్థాయిలో అమల్లోకి తీసుకురావాలన్నారు. పోలీస్, పట్టణ ప్రణాళిక విభాగం ఇంజనీరింగ్ విభాగాల సమన్వయంతో స్ట్రీమ్ లైన్ చేసి వీధి వ్యాపారులకు ఉపాధి అందేలా చూడాలన్నారు. బాలసముద్రంలోని కోకో పిట్ యూనిట్‌ను పరిశీలించిన కమిషనర్ నిర్వహణ బా గుందని, ఈయూనిట్ కార్పొరేషన్‌కు మోడల్‌గా నిలుస్తుందన్నారు. ఈతనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజా రెడ్డి, వెటర్నరీ వైద్యుడు గోపాలరావు, ఈఈ రవికుమార్, డీఈ సారంగం తదితరులు పాల్గొన్నారు.
కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
కాజీపేట, బాలసముద్రంలో తనిఖీ