
ఘనంగా తొలి ఏకాదశి పండుగ
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో హిందువుల తొలి పండుగ తొలి ఏకాదశి ఆదివారం ఘనంగా నిర్వహించారు. తొలి పండుగ రోజున దేవాలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో ఉదయం నుంచి ప్రత్యేక పూజలు, రుద్రాభిషేకాలు నిర్వహించారు. అనంతరం పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమ దంపతులు దేవాలయాన్ని సందర్శించి స్వామివారికి రుద్రాభిషేకం, పూజలు నిర్వహించారు. ఈమేరకు ఎమ్మెల్యే దంపతులు స్వామివారి సన్నిధిలో జ్యోతిప్రజ్వలన చేసి తొలి ఏకాదశి పండుగను, చాతుర్మాస వ్రతాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే దంపతులు భక్తులకు పులిహోర, అరటిపండ్లు ప్రసాదాలుగా అందజేశా రు. ఆలయ ఈఓ డి.అనిల్‌కుమార్ పర్యవేక్షించారు.