
షెల్టర్..ప్లీజ్
వరంగల్ అండర్ రైల్వే గేట్ ప్రాంతంలో ఒక్క బస్సు షెల్టర్ కూడా లేదు. దీంతో సిటీ బస్సుల కోసం వేచి ఉండే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ముఖ్యంగా శంభునిపేట జంక్షన్, ఖిలావరంగల్ పెట్రోల్‌పంపు, రంగశాయిపేట జంక్షన్, గవిచర్ల జంక్షన్లలో బస్‌షెల్టర్లు లేక ప్రయాణికులు రోడ్డుపైనే నిల్చుంటున్నారు. మరికొందరు సమీప దుకాణాల నీడలో ఉంటున్నారు. రోడ్డుపై నిల్చుండే సమయంలో ఇతర వాహనాలు ఢీకొన్న ఘటనలున్నాయి. బల్దియా అధికారులు ఇప్పటికై నా స్పందించి బస్ షెల్టర్లు నిర్మించాలని ప్రయాణికులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్‌ఫొటోగ్రాఫర్, వరంగల్