
బల్దియా వాహనాలపై నిరంతర నిఘా
వరంగల్ అర్బన్ : ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ (ఐసీసీసీ) ద్వారా ఇక బహుళ ప్రయోజనాలు కలగనున్నాయి. ఇప్పటివరకు ట్రాఫిక్, సైబర్ క్రైమ్, జంక్షన్ల పర్యవేక్షణకు పరిమితమైన ఈ సెంటర్ పరిధిలోకి గ్రేటర్ వరంగల్‌కు చెందిన సొంత, అద్దె వాహనాలన్నీ నడవనున్నాయి. ఏ రోజు ఎక్కడెక్కడ, ఎన్ని కిలోమీటర్లు తిరిగాయో ఎప్పటికప్పడు సమాచారం, ఫిల్టర్ బెడ్లు, వాటర్ ట్యాంకర్ల నిఘా వ్యవస్థను పటిష్టపర్చాలని నగర మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. ఈ మేరకు మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలోని ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి సందర్శించారు. సీసీ కెమెరాల పనితీరును అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. బల్దియాకు చెందిన పొక్లెయినర్లు, డోజర్లు, చెత్త తరలింపు ట్రాక్టర్ల కదలికలను ఐసీసీకేంద్రంనుంచే ఇండోర్ తరహాలో మానిటరింగ్ వ్యవస్థ కొనసాగేలా చర్యలు చేపట్టాలని కోరారు. హనుమకొండ బాలసముద్రంలో నిర్వహిస్తున్న వాహనాల షెడ్డుతో పాటు ట్రాన్స్‌ఫర్ స్టేషన్ ప్రాంతాల్లో సీసీకెమెరాల ఏర్పాటు, సాలిడ్ వేస్ట్ మేనేజ్‌మెంట్ మొత్తం ఒకే గొడుగు కిందికి తీసుకురావాలన్నారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ ఎస్‌ఈ మహేందర్, ఇన్‌చార్జ్ సిటీ ప్లానర్ రవీందర్ రాడేకర్, డిప్యూటీ కమిషనర్ ప్రసన్నరాణి, ఈఈలు రవికుమార్, మాధవీలత, డీఈలు రాజ్‌కుమార్, రాగి శ్రీకాంత్, ఐటీ మేనేజర్ రమేశ్ పాల్గొన్నారు.
సీవరేజ్ ట్రీట్‌మెంట్ ప్లాంట్ తనిఖీ..
స్మార్ట్‌సిటీలో భాగంగా ఉర్సుగుట్ట రంగసముద్రం చెరువు సమీపంలో బల్దియా నిర్మించిన సీవరేజీ ట్రీట్‌మెంట్ ప్లాంట్‌ను (ఎస్‌టీపీ) బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మంగళవారం తనిఖీ చేశారు. 2వ డివిజన్ పరిధి దసరా రోడ్ ప్రాంతంలో కమిషనర్ పర్యటించారు. మలేరియా సిబ్బంది నిర్వహిస్తున్న రిజిస్టర్‌ను ఆమె తనిఖీ చేశారు.
పన్ను వసూళ్ల నిర్లక్ష్యంపై అసహనం
పన్నుల వసూళ్లలో నిర్లక్ష్యంపై కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ అసహనం వ్యక్తంచేశారు. మంగళవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో పన్ను వసూళ్ల పురోగతిపై రెవెన్యూ అధికారులు సిబ్బందితో సమీక్షించారు. ఆర్‌ఐల వారీగా పన్ను వసూళ్ల పురోగతి ఏమాత్రమూ కనిపించడం లేదన్నారు. గతేడాదితో పోలిస్తే వెనుకబడి పోయారన్నారు. సమావేశంలో అదనపు కమిషనర్ జోనా, డిప్యూటీ కమిషనర్లు ప్రసన్న రాణి, రవీందర్, పన్నుల అధికారి రామకృష్ణ, ఆర్‌ఓలు షహజాది బేగం, యూసుపోద్దీన్, శ్రీనివాస్, ఆర్‌ఐలు పాల్గొన్నారు.
డివిజన్‌కు ఇద్దరు జవాన్లు ఉండాలి
ప్రతీ డివిజన్‌కు ఇద్దరు జవాను ్లమాత్రమే పారిశుద్ధ్య పనులను పర్యవేక్షించాలని కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. తన చాంబర్‌లో శానిటేషన్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇద్దరికంటే ఎక్కువ జవాన్లు ఉంటే ఇతర పనులకు కేటాయించాలన్నారు. ట్రేడ్ లైసెన్స్ వసూళ్లపై ప్రత్యేకంగా దృష్టిసారిస్తూ, లక్ష్యాలను చేరుకోవాలని ఆమె కోరారు.
కమాండ్ కంట్రోల్ సెంటర్‌ను సందర్శించిన
మేయర్ సుధారాణి, కమిషనర్