
మహిళలు ఆర్థిక పురోగతి సాధించాలి
హన్మకొండ అర్బన్: ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వహణతో మహిళలు ఆర్థిక పురోగతిని సాధించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆకాంక్షించారు. స్వయం సహాయక సంఘ మహిళల ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో నిర్వహిస్తున్న ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ విజయవంతంగా ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ కేక్ కట్ చేసి అభినందనలు తెలిపారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ ద్వారా మహిళలు మరింత ఆర్థిక పురోగతి సాధించాలన్నారు. కార్యక్రమంలో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, మెప్మా కో–ఆర్డినేటర్ రజితరాణి, ఇందిరా మహిళా శక్తి క్యాంటీన్ నిర్వాహకులు పాల్గొన్నారు.
కలెక్టర్ స్నేహ శబరీష్