శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ | - | Sakshi
Sakshi News home page

శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

Jul 22 2025 6:34 AM | Updated on Jul 22 2025 9:21 AM

శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

శ్రావణమాస ఉత్సవాల కరపత్రం ఆవిష్కరణ

హన్మకొండ కల్చరల్‌ : ఈ నెల 25వ తేదీ నుంచి ఆగస్టు 23 వరకు వేయిస్తంభాల దేవాలయంలో జరగనున్న శ్రావణ మాసోత్సవాల కరపత్రం, వాల్‌పోస్టర్‌ను ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, నీలిమా దంపతులు సోమవారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ ఈ నెల 25 నుంచి దేవాలయంలో శ్రావణ మాసోత్సవాలు ప్రారంభమవుతాయని తెలిపారు. స్వామివారికి రుద్రాభిషేకాలు, మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకాలు, సామూహిక రుద్రాభిషేకాలు జరుగుతాయన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ అనిల్‌కుమార్‌, ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, అర్చకులు సందీప్‌శర్మ ఆలయ సిబ్బంది మధుకర్‌, రజిత, కార్పొరేటర్‌ జక్కుల రవీంద్రయాదవ్‌, కాంగ్రెస్‌ నాయకులు కుమార్‌యాదవ్‌, రాహుల్‌రెడ్డి, ఠాకూర్‌, తోట పవన్‌, సాంబరాజు వికాస్‌ తదితరులు పాల్గొన్నారు. కాగా, నాయిని తన పుట్టిన రోజు సందర్భంగా కుటుంబ సభ్యులతో వేయిస్తంభాల ఆలయంలో, భద్రకాళి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement