ఇన్‌చార్జ్‌ల పాలన! | - | Sakshi
Sakshi News home page

ఇన్‌చార్జ్‌ల పాలన!

May 27 2025 12:54 AM | Updated on May 27 2025 12:54 AM

ఇన్‌చ

ఇన్‌చార్జ్‌ల పాలన!

రవాణా

శాఖలో

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

వాణా శాఖలో ఇన్‌చార్జ్‌ల పాలన కొనసాగుతోంది. కోర్టు స్టే కారణంగా కొద్ది రోజులుగా ఆ శాఖలో డిపార్ట్‌మెంటల్‌ ప్రమోషన్‌ కమిటీ(డీపీసీ) జాబితాకు బ్రేక్‌ పడింది. దీంతో పదోన్నతులు, నియామకాలు నిలిచాయన్న సాకుతో చాలాచోట్ల మోటార్‌ వెహికిల్‌ ఇన్‌స్పెక్టర్‌(ఎంవీఐ)లనే ఇన్‌చార్జ్‌ జిల్లా రవాణా శాఖాధికారులు(డీటీఓ)గా నియమించారు. మరికొందరు ఎంవీఐలకు.. ఎంవీఐతో పాటు ఇన్‌చార్జ్‌ డీటీఓలుగా ఒకేచోట పనిచేసే అవకాశం కల్పించారు. కాగా.. కొందరు ఎంవీఐలు ఇన్‌చార్జ్‌ డీటీఓ పోస్టును పోటీపడి తెచ్చుకున్న సందర్భాలుంటే.. మరికొన్నిచోట్ల జూనియర్లను డీటీఓలుగా తెరమీద పెట్టి సీనియర్లు తెరవెనుక చక్రం తిప్పుతున్నారన్న టాక్‌ వినిపిస్తోంది.

ఇప్పుడు కూడా ఇష్టారాజ్యం..

ఉమ్మడి వరంగల్‌ ఆరు జిల్లాల్లో డీటీసీ, డీటీఓ పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లే ఉన్నారు. గత ప్రభుత్వ హయాంలో పదోన్నతులు నిలిపేసి ఒక్కో సీనియర్‌ ఎంవీఐకి రెండు నుంచి నాలుగు జిల్లాల్లో ‘ఆన్‌ డిప్యుటేషన్‌ పోస్టింగ్‌’లు ఇచ్చి పెద్ద ఎత్తున దండుకున్నారన్న ఆరోపణలపై విచారణ జరిగింది. ఇందులో కీలక సూత్రధారిగా ఉన్న ఓ అధికారి ప్రభుత్వం మారాక స్వచ్ఛంద ఉద్యోగ విరమణ పెట్టుకోవడం కొసమెరుపు కాగా.. అతడికి అండగా నిలిచిన కొందరు ఏసీబీ కేసుల్లో ఇరుక్కుని సస్పెండయ్యారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం హయాంలోనూ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న కొందరు ఇన్‌చార్జ్‌ల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌లోని కొందరు పెద్దల ఆశీస్సులతో పలువురు పదోన్నతులు, హోదాలతో పని లేకుండా ఎంవీఐలు ఇన్‌చార్జ్‌ డీటీఓలు, డీటీసీలుగా వ్యవహరిస్తున్నారు. అక్కడితో ఆగకుండా పొరుగు జిల్లాల బాధ్యతల కోసం పైరవీలు చేయడంపై చర్చ జరుగుతోంది.

పాతుకుపోయారు..

ఏళ్లుగా పాతుకుపోయిన కొందరు రవాణాశాఖ అధి కారుల తీరుపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. హైదరాబాద్‌ స్థాయిలో పైరవీలు చేసుకుంటూ కో రుకున్న పోస్టుల్లో కొనసాగుతున్నారనే చర్చ జరుగుతోంది. భూపాలపల్లి కార్యాలయంలో కీలకంగా ఉన్న ఓ అధికారి నాలుగేళ్లుగా అక్కడే తిష్ట వేశారు. వివిధ పోస్టుల్లో అక్కడే పాతుకుపోవడంతో పాలన గాడి తప్పి అవినీతి పెరిగిందన్న ఆరోపణ లున్నాయి. హనుమకొండ డీటీఓ ఆఫీసులో తెరవెనుక చక్రం తిప్పుతున్న ఓ కీలక అధికారి సుమారు పదేళ్లుగా ఉమ్మడి వరంగల్‌లో వివిధ చోట్ల పనిచేసి పాతుకుపోయారన్న చర్చ ఉంది. ఏడాది క్రితం హనుమకొండకు బదిలీ కాగా.. కొద్ది రోజులకే ఏ సీబీ దాడులు జరిగాయి. ఈకేసులో డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌ సస్పెండ్‌ కావడం కలకలం రేపింది.

కీలక పోస్టుల్లో ఇన్‌చార్జ్‌లు..

● హనుమకొండ డీటీఓ, డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌(డీటీసీ)గా ఉన్న పుప్పాల శ్రీనివాస్‌పై అక్రమాస్తుల ఆరోపణల నేపథ్యంలో ఏసీబీ దాడులు చేయగా సస్పెండయ్యారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించకపోవడంతో కరీంనగర్‌ డీటీసీ పురుషోత్తంకు ఇన్‌చార్జ్‌ డీటీసీ బాధ్యతలు అప్పగించారు.

● హనుమకొండ డీటీఓ పోస్టు ఖాళీ కావడంతో వాస్తవానికి అదే కార్యాలయంలో సీనియర్‌గా ఉన్న 1994 బ్యాచ్‌కు చెందిన రమేశ్‌రాథోడ్‌కు ఇన్‌చార్జ్‌ డీటీఓగా ఇవ్వాల్సి ఉంది. అయితే కీలక పోస్టులో ఉండడం ఇష్టం లేక అతను ఆసక్తి చూపకపోవడంతో 2012 బ్యాచ్‌కు చెందిన వేణుగోపాల్‌కు ఇన్‌చార్జ్‌ డీటీఓగా నియమించినట్లు ప్రచారంలో ఉంది.

● మహబూబాబాద్‌ గౌస్‌పాషా ఏసీబీకి చిక్కడంతో సస్పెన్షన్‌కు గురయ్యాడు. ఆయన స్థానంలో వరంగల్‌ ఎంవీఐ జైపాల్‌రెడ్డిని ఇన్‌చార్జ్‌ డీటీఓగా నియమించారు.

● ములుగు డీటీఓ సిరాజ్‌ రెహమాన్‌ ఉద్యోగ విరమణ చేశాడు. అక్కడ ఎంవీఐ, డీటీఓ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. సిరాజ్‌ రిటైర్డ్‌మెంట్‌ తర్వాత ఆయన స్థానంలో పెద్దపల్లి ఎంవీఐ బి.శ్రీనివాస్‌ను ఇన్‌చార్జ్‌ డీటీఓగా నియమించారు. ప్రస్తుతం ములుగు ఎంవీఐ, ఇన్‌చార్జ్‌ డీటీఓగా కూడా శ్రీనివాసే వ్యవహరిస్తున్నారు.

● జేఎస్‌ భూపాలపల్లి ఇన్‌చార్జ్‌ డీటీఓ వేణు బదిలీ తర్వాత ఎవరినీ నియమించలేదు. అక్కడ ఎంవీఐగా ఉన్న సంధానికే ఇన్‌చార్జ్‌ డీటీఓ బాధ్యతలు ఇచ్చారు. ప్రస్తుతం భూపాలపల్లి ఎంవీఐ, ఇన్‌చార్జ్‌ డీటీఓగా సంధానీ పని చేస్తున్నారు.

● ఈ ఏడాది ఫిబ్రవరి 8న వరంగల్‌ డీటీఓ లక్ష్మిపై బదిలీ వేటు పడింది. డీటీసీ పుప్పాల శ్రీనివాస్‌పై ఏసీబీ దాడులు జరిగిన మరుసటి రోజే లక్ష్మిని బదిలీ చేయడం చర్చనీయాంశమైంది. ఆమె స్థానంలో ఎంవీఐ శోభన్‌బాబు ఇన్‌చార్జ్‌ డీటీఓగా వ్యవహరిస్తున్నారు.

ఎంవీఐలే డీటీఓలు.. పలుచోట్ల ఇదే పరిస్థితి

హనుమకొండ డీటీఓగా

జూనియర్‌కు బాధ్యతలు

తెరవెనుక చక్రం తిప్పుతున్న సీనియర్లు

విచారణలు, ఆరోపణలున్నా..

కుర్చీలు వదలని అధికారులు

ఆదాయం ఉన్న పోస్టింగ్‌ల కోసం

ఇంకా పైరవీలు

ఇన్‌చార్జ్‌ల పాలన! 1
1/1

ఇన్‌చార్జ్‌ల పాలన!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement