నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి | - | Sakshi
Sakshi News home page

నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి

Jun 16 2026 1:40 AM | Updated on Jun 16 2026 1:40 AM

నెలాఖరులోగా కాల్వల మరమ్మతులు పూర్తి

తెనాలి టౌన్‌: గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా పరిధిలోని ప్రధాన పంట కాలువలు వాటి పరిధిలోని బ్రాంచ్‌ కెనాళ్లను ఈ నెలాఖరులోగా శుభ్రం చేసి రైతులకు జూలై మొదటి వారంలో సాగునీరు అందివ్వనున్నట్టు గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా తెనాలి కార్యాలయ ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ ఎస్‌. సుధాకర్‌ తెలిపారు. ఈమేరకు సోమవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడా రు. ఈ ఆయకట్టు పరిధిలో 5,72,000 ఎకరాల వ్యవసాయ భూమి సాగులో ఉన్నట్టు చెప్పారు. మొత్తం 10 ప్రధాన పంట కాలువలు, వాటి కింద 50 పైబడి బ్రాంచ్‌ కెనాల్స్‌ ఉన్నట్టు వివరించారు. వీటి మెయింట్‌ నెన్స్‌కు ప్రభుత్వం రూ. 13.64కోట్లు కేటాయించినట్లు తెలిపారు. ప్రధాన పంట కాల్వలో గురప్రు డెక్క తొలగిస్తున్నట్టు తెలిపారు. బ్రాంచ్‌ కెనాల్స్‌కు అవసరమైనచోట్ల నూతన షట్టర్లు ఏర్పాటు చేస్తామన్నారు.

20 సెక్షన్ల పరిధిలో 284 వర్కులు..

గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా కార్యాలయ పరిధిలో 20 సెక్షన్లు ఉండగా మొత్తం 284 వర్కులు చేపట్టారు. ఇవన్నీ సాగునీటి సంఘాల ఆధ్వర్యంలో వర్కులు జరుగుతున్నట్టు చెప్పారు. ప్రకాశం జిల్లాలో ఐదు వర్కులు, బాపట్ల జిల్లాలో 162, గుంటూరు జిల్లాలో 117 వర్కులు జరుగుతున్నాయన్నారు. నెలాఖరులోగా పనులు పూర్తి చేసి పంటకాలువలను అందుబాటులోకి తేనున్నట్టు వివరించారు. అయితే గురప్రు డెక్కతో నిండిన ప్రధాన పంట కాలువల మరమ్మతులు నత్తనడకన సాగుతున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు.

గుంటూరు–కృష్ణా పశ్చిమ డెల్టా

కార్యాలయ ఈఈ ఎస్‌.సుధాకర్‌

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement