వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు నూరిఫాతిమా
నెహ్రూనగర్ (గుంటూరు ఈస్ట్) : అమరావతి శాశ్వత రాజధాని పేరుతో చంద్రబాబు ప్రభుత్వం కొత్త నాటకానికి తెరదీసిందని వైఎస్సార్ సీపీ నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా పేర్కొన్నారు. సోమవారం ఆమె విలేకరుతో మాట్లాడుతూ రాష్ట్రం విడిపోయిన తరువాత కేంద్ర నుంచి స్పెషల్ స్టేటస్ తీసుకువస్తామని, రాష్ట్ర అభివృద్ధిని పరుగులు పెట్టిస్తామని చెప్పి 2014 అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం ఓటుకు నోటు కేసులో పట్టుబడి కేంద్ర నుంచి స్పెషల్ స్టేటస్ అనే మాట ఎత్తకుండా 2019 వరకు అమరావతి నిర్మిస్తున్నామని కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి మీరేమి చేశారని ప్రశ్నించారు. రాజధానిలో ఇంత వరకు అభివృద్ధి జరగలేదని మొదట విడతలో భూములు ఇచ్చిన రైతులు ఆందోళన చెందుతున్న క్రమంలో ఇప్పుడు రెండో విడత భూ సేకరణకు రైతులు ముందుకు రాకపోవడంతో కొత్త నాటకానికి తెర తీసి శాశ్వత రాజధాని అని అసెంబ్లీలో తీర్మానించడం హాస్యాస్పదంగా ఉందన్నారు. మీరు అమరావతి రాజధాని పేరుతో మీ సొంత ప్రయోజనాలకోసం పాకులాడుతున్నారే తప్ప రాష్ట్ర ప్రయోజనాల కోసం, అమరావతి రాజధాని నిర్మాణం కోసం కాదన్నారు. వైఎస్ జగన్ అమరావతి రాజధానిగా ఉంటుందని..దానితో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్రలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో మూడు రాజధానులు అంశాన్ని తీసుకువచ్చారన్నారు. అప్పగించారు.
– తాడికొండ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు
తాడికొండ: రాజధానికి చట్టబద్ధత పేరుతో ఏపీ అసెంబ్లీ ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి తీర్మానం అంటూ ప్రభుత్వం హడావుడి చేయడం సిగ్గుచేటని తాడికొండ నియోజకవర్గ సమన్వయకర్త వనమా బాల వజ్రబాబు (డైమండ్) అన్నారు. మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గతంలో ప్రత్యేక హోదాపై అన్ని పార్టీలు ఏకగ్రీవంగా అసెంబ్లీ, పార్లమెంటులో చట్టం చేసినా ఏం ప్రయోజనం జరిగిందో చెప్పాలని చంద్రబాబును సూటిగా ప్రశ్నించారు. బాబును నమ్మి 28 వేల మంది రైతులు 33 వేల ఎకరాల భూములిస్తే ఇప్పుడు వాళ్ల ప్రయోజనాలను తాకట్టు పెట్టి, మళ్ళీ రెండో విడత పూలింగ్, అవసరమైతే మూడో విడత కూడా ఉంటుందని ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారన్నారు. 2014–19 కాలంలో బాబు ప్రభుత్వంలో మొత్తం రూ.5 వేల కోట్లు ఖర్చుపెడితే అందులో సుమారు రూ.2 వేల కోట్లు వడ్డీ ఉందన్నారు. ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం వచ్చి రెండేళ్ల్లు అవుతుందని, 2028కి రాజధాని నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్నారని అది ఎలా సాధ్యమో రైతులకు వివరించాలన్నారు.
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పుడైనా రాజధానికి వ్యతిరేకమని చెప్పిందేమో చెప్పాలని టీడీపీ ప్రభుత్వాన్ని ఆయన ప్రశ్నించారు. అభివృద్ధికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ వ్యతిరేకం కాదని, ఇక నుంచైనా మీరు పద్ధతులు మార్చుకొని ముందుకెళ్ళాలని సూచించారు.ఈ సమావేశంలో తాడికొండ, తుళ్ళూరు మండల అధ్యక్షులు వంగా పోలారెడ్డి, మైనేని నాగమల్లేశ్వరరావు, నాయకులు చుండు వెంకటరెడ్డి, షేక్ బాజీ, షేక్ అజీస్, కొప్పుల శేషగిరిరావు, వెంకటస్వామి, ఆరేపల్లి జోజి పాల్గొన్నారు.


