ఫైనల్స్‌లో 5–0 తేడాతో మధ్యప్రదేశ్‌పై ఘన విజయం
గుంటూరు వెస్ట్ (క్రీడలు): అంధుల క్రికెట్ టోర్నమెంట్‌లోమధ్యప్రదేశ్‌పై ఆంధ్ర జట్టు 5–0 తేడాతో ఘన విజయం సాధించింది. ఐదు రోజులుగా స్థానిక అరండల్‌పేటలోని పిచ్చుకులగుంట క్రీడా మైదానంలో క్రికెట్ అసోసియేషన్ ఫర్ ది బ్లైండ్ ఆంధ్రప్రదేశ్ (సీఏబీఏపీ), డిఫరెంట్లీ ఏబుల్డ్ క్రికెట్ కౌన్సిల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ అంధుల క్రికెట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘అంధుల క్రికెట్ ఇన్‌క్లూజివ్ చాలెంజర్స్ ట్రోఫీ‘ టీ20 బైలాటరల్ సిరీస్‌ను ఆంధ్ర జట్టు ఏకపక్ష విజయాలతో కైవసం చేసుకుంది. శుక్రవారం జరిగిన ఫైనల్స్‌లో జట్టు సమిష్టిగా ఆడి విజయం నమోదు చేసింది. బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జాయింట్ కలెక్టర్ అశుతోష్ శ్రీవాస్తవ మాట్లాడుతూ పోటీతత్వం ముందు అంధత్వం ఓటమి పాలైందని పేర్కొన్నారు. యువ క్రీడాకారులకు ఈ విజయం ఎంతో స్ఫూర్తినిస్తుందని చెప్పారు. దృష్టి లోపం ఉన్నా, గుండె నిండా ధైర్యంతో మైదానంలో ప్రదర్శించిన పోరాట పటిమ అద్భుతమన్నారు. విజేతలతోపాటు రన్నర్స్‌కు ట్రోఫీలతోపాటు నగదు బహుమతులు అంజేశారు. అంతర్జాతీయ అంధుల మాజీ క్రికెటర్ అజయ్‌కుమార్ రెడ్డి, ఎస్‌బీఐ డీజీఎం కృష్ణకుమార్, వికలాంగుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకులు వెంకటరమణప్ప, ఏఐబీఓిసీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి జయకుమార్, వీసీవైఏ అధ్యక్షుడు ఎల్.రత్నరాజ్ పాల్గొన్నారు.


