డివైడర్‌ను ఢీకొని బైకిస్టు మృతి | - | Sakshi
Sakshi News home page

డివైడర్‌ను ఢీకొని బైకిస్టు మృతి

Mar 28 2026 7:45 AM | Updated on Mar 28 2026 7:45 AM

కృష్ణలంక(విజయవాడతూర్పు): అతివేగంగా వెళ్తు న్న ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌ను ఢీకొనడంతో ఒక యువకుడు దుర్మరణం చెందిన ఘటన కృష్ణలంక పోలీస్‌స్టేషన్‌ పరిధిలో శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు తాడేపల్లి మండలం గుండిమెడకు చెందిన మేడికొండ అన్వేష్‌(27), జెట్టి అజయ్‌(17), మేడికొండ అఖిల్‌బాబు (15), పల్నాడు జిల్లా దొడ్లేరు గ్రామానికి చెందిన ఈదులమూడి రాజ్‌కుమార్‌(24) స్నేహితులు. అజయ్‌, అఖిల్‌బాబు ఐటీఐ చదువుతుండగా అన్వేష్‌ పెయింటర్‌గా పనిచేస్తుంటాడు. రాజ్‌కుమార్‌ గుండిమెడలోని సోదరి ఇంటిలో ఉంటూ పెయింటింగ్‌ పనులకు వెళ్తుంటాడు. వీరు నలుగురు శుక్రవారం మధ్యాహ్నం 2గంటలకు సెల్‌ఫోన్‌ రిపేరు నిమిత్తం ఒకే ద్విచక్ర వాహనంపై గుండిమెడ నుంచి గవర్నర్‌పేటలోని ఎన్టీఆర్‌ కాంప్లెక్స్‌కు బయలుదేరారు. ద్విచక్ర వాహనాన్ని రాజ్‌కుమార్‌ నడుపుతుండగా వెనుక అజయ్‌, తర్వాత అఖిల్‌, ఆ తర్వాత అన్వేష్‌ కూర్చున్నారు. మధ్యాహ్నం 2.40 గంటల సమయంలో వారధి దాటి ట్రాఫిక్‌ సబ్‌ కంట్రోల్‌ సమీపానికి చేరుకోగానే అతివేగంగా వెళ్తున్న వాహనం అదుపు తప్పి డివైడర్‌ను ఢీకొట్టింది. దీంతో నలుగురు కింద పడిపోయి రోడ్డుకు గుద్దుకున్నారు. అన్వేష్‌ తల పగిలి అక్కడికక్కడే మృతిచెందగా మిగిలిన ముగ్గురు స్వల్పంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడ్డ ముగ్గురిని అంబులెన్స్‌ ద్వారా చికిత్స నిమిత్తం, అన్వేష్‌ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement