ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదేలే..
● అంబటిని ఎవరు తిట్టారో హోంమంత్రికి
తెలియకపోవడం విడ్డూరం
● మాజీమంత్రి అంబటి రాంబాబు
కుమార్తె మౌనిక ఫైర్
పట్నంబజారు (గుంటూరు ఈస్ట్) : ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదేలేదని, అంబటి రాంబాబు వెనకడుగు వేయరని.. ప్రభుత్వ అక్రమాలకు, దౌర్జన్యాలకు తగ్గే ప్రసక్తేలేదని ఆయన కుమార్తె మౌనిక స్పష్టం చేశారు. రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రాజ్యాంగం నడవటంలేదని, ఒక నియంత రెడ్‌బుక్ పాలన సాగుతోందని ఆమె ఆరోపించారు. అంబటి రాంబాబు మాజీమంత్రి అయి ఉండి కోర్టు వద్ద అలా ఎలా వ్యవహరిస్తారని అంటున్న హోంమంత్రి అనితకు, మా ఇంటిపై దాడి చేసేటప్పుడు ఆయన మాజీమంత్రి అని గుర్తుకురాలేదా అని ప్రశ్నించారు. గుంటూరులో శనివారం ఆమె మీడియాతో మాట్లాడుతూ.. ‘తిరుమల శ్రీవారిని వైఎస్సార్‌సీపీ నాయకుడిలా పోస్టర్లు వేసి టీడీపీ నేతలు దుష్ప్రచారం చేస్తుంటే, ఆ పాపాన్ని అంబటి రాంబాబు ప్రశ్నించారు. ఆ అంశాన్ని పక్కదారి పట్టించేందుకు ఆయనపై దాడికి తెగబడ్డారు. అంతేకాక.. ఇంట్లో ఉన్న మాపై కూడా దాడిచేశారు. మా నాన్నపై 36 అక్రమ కేసులు బనాయించి పీటీ వారెంట్ వేస్తూ ఆయన్ను ఇబ్బందిపెడుతున్నారు. అభిమానులను ఉత్సాహపరిచేందుకే ఆయన పుష్ప సినిమాలో మాదిరిగా సైగలు చేశారు’. అని చెప్పారు.
హోంమంత్రి వ్యాఖ్యలు ఎవరి గురించి?
‘నిన్న సభలో హోంమంత్రి అనిత వ్యాఖ్యలు అంబటి రాంబాబు గురించా.. లేకపోతే పరోక్షంగా లోకేశ్ గురించా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. హోంమంత్రి గతంలో అమ్మ అనే మాటల్లో కూడా ఎంత అశ్లీలంగా మాట్లాడొచ్చో ప్రపంచానికి తెలియజేసిన గొప్ప మహిళ. చంద్రబాబునాయుడుని అరెస్టు చేసేటప్పుడు ఎలాంటి పదాలు వాడారో మేం వివరంగా చెప్పక్కర్లేదు, అందరికీ తెలుసు. ఇక అంబటిని తిట్టిన వారికి సంబంధించిన వివరాలిస్తే చర్యలు తీసుకుంటామని ఆమె చెబుతున్నారు.. అయితే, ఆయన్ని ఎవరు తిట్టారో ప్రపంచమంతా తెలుసు. సోషల్ మీడియాలో కూడా వైరల్ అయింది. కానీ, హోంమంత్రికి తెలియకపోవటం విడ్డూరం. అంబటి రాంబాబుపై దాడి జరిగినప్పుడు ఆయనే స్వయంగా ఫిర్యాదుచేస్తే మీరు ఎంతమందిపై కేసు నమోదు చేశారు? స్థానిక ఎమ్మెల్యే గల్లా మాధవి మా ఇంటి వద్ద చేసిన వ్యాఖ్యలు మీ దృష్టికి రాలేదా?’ అని మౌనిక మండిపడ్డారు.
మంగళగిరి టౌన్: విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న గంగ, పార్వతి (దుర్గా) సమేత మల్లేశ్వర స్వామి వారికి మంగళగిరికి చెందిన బహుత్తమ పద్మశాలీ సేవా సంఘం ప్రతినిధులు శనివారం చేనేత పట్టు వస్త్రాలను సమర్పించారు. ఏటా మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని స్వామికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. పట్టు వస్త్రాలను సమర్పించేందుకు విచ్చేసిన సేవా సంఘం సభ్యులకు ఆలయ ఈఓ శీనానాయక్, చైర్మన్ రాధాకృష్ణ సాదరంగా స్వాగతం పలి కారు. సేవా సంఘం సభ్యులు తొలుత అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు జరిపించుకున్న అనంతరం స్వామికి పట్టువస్త్రాలు, పూలు, పండ్లు, పూజా సామగ్రిని సమర్పించారు. పట్టువస్త్రాలు సమర్పించిన వారిలో చిల్లపల్లి మోహన్‌రావు, అందే నాగవరప్రసాద్, చిల్లపల్లి శ్రీనివాస్, తమ్మిశెట్టి జానకీదేవి, గంజి చిరంజీవి, గుత్తికొండ ధనుంజయరావు, దామర్ల నాగమణి, రామనాధం శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ):ఎన్టీఆర్ జిల్లా విజయవాడ ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న దుర్గమ్మ సన్నిధిలో జరుగుతున్న నిత్యాన్నదానానికి పలువురు భక్తులు విరాళాలు సమర్పించారు. గుంటూరు బ్రాడీపేటకు చెందిన పి.కామేశ్వరరావు కుటుంబం ఈఓ శీనానాయక్‌ను కలిసి రూ.1,01,116 విరాళం అందజేసింది. అనంతరం దాతలకు ఆలయ మర్యాదలతో అమ్మవారి దర్శనం కల్పించారు. వేద పండితుల ఆశీర్వచనం అనంతరం దాతలకు ఆలయ అధికారులు అమ్మవారి చిత్రపటం, ప్రసాదాలు, శేషవస్త్రాలను అందించారు.
ఎన్ని ఇబ్బందులు పెట్టినా తగ్గేదేలే..


