పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు | - | Sakshi
Sakshi News home page

పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు

పొగడ వృక్ష వాహనంపై దర్శనమిచ్చిన మల్లేశ్వరుడు ఆరవపల్లిలో మహాశివరాత్రి వేడుకలు ప్రారంభం రేపల్లె: మహాశివరాత్రిని పురస్కరించుకొని మండలంలోని ఆరవపల్లి గ్రామంలో వేంచేసి ఉన్న బాల కోటేశ్వరస్వామి ఆలయంలో తిరునాళ్లు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. మూడు రోజుల పాటు నిర్వహించనున్న ఈ తిరునాళ్లలో భాగంగా తొలిరోజు వేకువజామునే స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. పశుసంపద అభివృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ పశు యజమానులు తమ పశువులను ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించి మొక్కుబడులు చెల్లించుకున్నారు. భక్తుల రద్దీతో ఆలయ ప్రాంగణం ఆధ్యాత్మిక వాతావరణంతో కళకళలాడింది.

మంగళగిరి టౌన్‌: మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మంగళగిరి పట్టణంలో వేంచేసి యున్న గంగా భ్రమరాంబ సమేత మల్లేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలు శనివారంతో 8వ రోజుకు చేరుకున్నాయి. స్వామి వారు పొగడ వృక్ష వాహనంపై భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. పురవీధుల్లో నిర్వహించిన ఊరేగింపులో భక్తులు ఆయా కూడళ్లలో స్వామివారిని దర్శించుకుని టెంకాయలు, హారతులు సమర్పించారు. మంగళగిరి పట్టణానికి చెందిన జంజనం ప్రసన్న కోటేశ్వరరావు, అనిత దంపతులు, వంగర కవిత, దుర్గా వెంకట మహేష్‌ దంపతులు, కుటుంబ సభ్యులు ఉత్సవ కై ంకర్య పరులుగా వ్యవహరించారు. దేవస్ధాన ఈ.వో. గోపీ ఉత్సవ నిర్వహణను పర్యవేక్షించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement