బలాలపై దృష్టి సారించాలి | - | Sakshi
Sakshi News home page

బలాలపై దృష్టి సారించాలి

Feb 15 2026 7:32 AM | Updated on Feb 15 2026 7:32 AM

బలాలప

బలాలపై దృష్టి సారించాలి

మంగళగిరి టౌన్‌ : యువత బలహీనతలను తగ్గించుకుని బలాలపై దృష్టి సారిస్తే అన్నింటా విజయం సొంతం అవుతుందని కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జునరామ్‌ మేఘవాల్‌ పేర్కొన్నారు. ఏపీ ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో శనివారం ప్రత్యేక స్నాతకోత్సవ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిధిగా హాజరయ్యారు. అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు. కృత్రిమ మేధ వినియోగంలో సవాళ్లు ఉన్నప్పటికీ ఆ సాంకేతికతను మరింత అభివృద్ధి చేసి సమాజానికి ఉపయుక్తంగా మలుచుకోవాలన్నారు. గౌరవ అతిథిగా హాజరైన డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ సమీర్‌ వి కామత్‌ మాట్లాడుతూ భారత్‌లో శాస్త్ర, సాంకేతిక రంగం ఎంతో అభివృద్ధి చెందిందని తెలిపారు. ఆపరేషన్‌ సిందూర్‌ విజయం వెనుక సాంకేతికత వినియోగం ఎంతో ఉందన్నారు. డాక్టర్‌ కామత్‌కు వర్సిటీ గౌరవ డాక్టరేట్‌ను ప్రదానం చేసింది. వర్శిటీలో ఏడుగురు రీసెర్చ్‌ స్కాలర్లకు పిహెచ్‌డీ డిగ్రీలు ప్రసాదం చేశారు. కేంద్ర మంత్రి అర్జున్‌రామ్‌, డీఆర్‌డీవో చైర్మన్‌ డాక్టర్‌ కామత్‌లను వర్శిటీ యాజమాన్యం సత్కరించి జ్ఞాపికలను అందజేసింది. ఈ కార్యక్రమంలో వర్సిటీ వ్యవస్ధాపక కులపతి డాక్టర్‌ టీఆర్‌ పారివేందర్‌, వర్శిటీ ప్రో చాన్సలర్‌ డాక్టర్‌ పి. సత్యనారాయణన్‌, ఉపకులపతి ఆచార్య కె. సతీష్‌కుమార్‌, ఎస్‌ఆర్‌ఎం ట్రస్టీ మెంబర్‌ మణిమంగై, రీసెర్చ్‌ గ్రూప్‌ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ ఆచార్య డి. నారాయణ రావు, రిజిస్ట్రార్‌ ప్రేమ్‌కుమార్‌, కంట్రోలర్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ డాక్టర్‌ షీలా సింగ్‌, డాక్టర్‌ వినాయక్‌ తదితరులు పాల్గొన్నారు.

బలాలపై దృష్టి సారించాలి 1
1/2

బలాలపై దృష్టి సారించాలి

బలాలపై దృష్టి సారించాలి 2
2/2

బలాలపై దృష్టి సారించాలి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement