పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం
ఎమ్మెల్యే యరపతినేని డైరెక్షన్‌లో సీఐ భాస్కరరావు సారథ్యంలో సాల్మన్‌ని దారుణంగా హతమార్చారు. దాదాపు రెండేళ్లుగా గ్రామానికి దూరంగా ఉంటూ భార్యను చూడటానికి వచ్చిన సాల్మన్‌ని చంపడం సిగ్గుచేటు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి పల్నాడు వ్యాప్తంగా ఆటవిక రాజ్యం నడుస్తోంది. గూండాలు, దోపిడీదారులకు అండగా పోలీసులు పనిచేస్తున్నారు. జిల్లాను అభివృద్ధి చేయడం చేతకాక దాడులతో ప్రజలను భయపెట్టాలని చూస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి చేతనైతే అభివృద్ధిలో పోటీపడాలి. మెడికల్ కాలేజీ పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తేవాలి. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేదాకా పోరాటం చేస్తాం.
– టీజేఆర్ సుధాకర్‌బాబు, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే


