ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం..
ముఖ్యమంత్రి చంద్రబాబు రాజకీయాలను దోపిడీ, దుర్మార్గాల వైపు నడిపిస్తున్నాడు. శాంతిభద్రతలను కాపాడటం చేతకాని పోలీసులు ఉద్యోగాలకు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోవాలి. అంతేకానీ అమాయకులైన దళితులను టీడీపీ కక్షలకు బలిపెట్టడం మంచిదికాదు. కూటమి ప్రభుత్వానికి ఎస్సీల బలం చూపిస్తాం. భయపడటానికి పార్టీ కార్యకర్తలు సిద్ధంగా లేరు. వైఎస్ జగన్ నాయకత్వలో అక్రమాలపై తిరుగుబాటు చేస్తాం. ఊరు బాగుంటే చాలు, ఇదే చివరి హత్య కావాలని చెప్పిన సాల్మన్ బిడ్డల పెద్ద మనసుని అభినందిస్తున్నా. – సాకే శైలజానాథ్, మాజీ మంత్రి


