జగనన్నని అభిమానిస్తే చంపేస్తారా?
వైఎస్సార్ సీపీకి ఓటు వేశారని, మాజీ సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని అభిమానించి అండగా ఉన్నారని దళితులను కూటమి ప్రభుత్వం హత్యలు చేయిస్తుంది. జగన్‌ని అభిమానిస్తే చంపేస్తారా..జగన్‌కి అండగా ఉంటే చంపేస్తామని సంకేతాలను చంద్రబాబు ప్రభుత్వం ఇస్తుంది. ఈ రోజు మందా సాల్మన్‌ని చంపి ఆనందంగా ఉండవచ్చు..కానీ రేపు ఖచ్చితంగా ప్రతీకారాలు ఉంటాయనే విషయాన్ని గుర్తు పెట్టుకొవాలి. ప్రతికారం తీర్చుకోలేనంత దద్దమ్మలు దళితులు కాదని, ఓటు అనే ఆయుధం ద్వారా చంద్రబాబుపై ప్రతీకారం తీర్చుకునేందుకు దళితులు సిద్ధంగా ఉన్నారు. సాల్మన్ హత్యని వైఎస్సార్ సీపీ చాలా సీరియస్‌గా తీసుకుంటుంది. సాల్మన్ కుటుంబానికి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటాం.
– జూపూడి ప్రభాకర్, మాజీ ఎమ్మెల్సీ


