సెమీ క్రిస్మస్ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి
గుంటూరు లీగల్: జిల్లా కోర్టులో గుంటూరు బార్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. వేడుకలకు ముఖ్య అతిథిగా హైకోర్టు న్యాయమూర్తి రఘునందన్ రావు, జిల్లా కోర్టు ప్రధాన న్యాయమూర్తి బి.సాయి కళ్యాణ్ చక్రవర్తి పాల్గొన్నారు. రెవ. సుమంత్ సుధా సందేశం ఇచ్చారు. కార్యక్రమానికి గుంటూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంగళ శెట్టి శివ సూర్యనారాయణ అధ్యక్షత వహించారు. కోర్టు చిరు ఉద్యోగులకు దుస్తులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో న్యాయవాదులు, కుటుంబసభ్యులు పాల్గొన్నారు.
ఇంద్రకీలాద్రి(విజయవాడపశ్చిమ): ఇంద్రకీలాద్రిపై దుర్గమ్మ సన్నిఽధిలో నిత్యాన్నదానానికి శుక్రవారం భక్తులు విరాళాలను సమర్పించారు. తాడేపల్లికి చెందిన కొండిశెట్టి వెంకట విఠల్ భాస్కర్ తన కుటుంబ సభ్యులైన కె.సత్యనారాయణమ్మ, అంజయ్యల పేరిట రూ. 1,00,116 విరాళాన్ని ఆలయ అధికారులకు అందజేశారు.
ఎంఎస్‌ఎంఈల పార్కుల ఏర్పాటు వేగవంతం
జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా
గుంటూరు వెస్ట్: అన్ని నియోజకవర్గాల్లో ఎంఎస్‌ఎంఈల పార్కుల ఏర్పాటు వేగవంతం చేయాలని కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా ఆదేశించారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో జిల్లా పారిశ్రామిక, ఎగుమతుల ప్రోత్సాహక మండలి(డీఐఈపీసీ) సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ ఎంఎస్‌ఎంఈ పార్కులు, కామన్ ఫెసిలిటీ సెంటర్లకు భూముల కేటాయింపును పరిశ్రమలు, ఏపీఐఐసీ శాఖలు సమన్వయంతో నిరంతరం పర్యవేక్షించాలన్నారు. జిల్లాలో పరిశ్రమలు ఏర్పాటుకు రాష్ట్ర స్థాయిలో ఎంఓయులు జరిగిన సంస్థలు వెంటనే కార్యకలాపాలు ప్రారంభించేలా అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ జయలక్ష్మి మాట్లాడుతూ గత నెల రోజుల్లో 970 దరఖాస్తులు అందగా 734 దరఖాస్తులకు మంజూరు ఇచ్చామన్నారు.
సెమీ క్రిస్మస్ వేడుకల్లో హైకోర్టు న్యాయమూర్తి


