తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ ప్రదర్శనకు తె
తెనాలి: విజయవాడలోని టీటీడీ కల్యాణ మండపం రోడ్డులో ఆదివారం జరగనున్న తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ 4వ చిత్రకళా సంతలో తెనాలి శిల్పకళా ప్రదర్శనను ఏర్పాటు చేస్తున్నారు. సొసైటీ కోరికపై తెనాలిలోని కాటూరి ఆర్ట్ గ్యాలరీ నిర్వాహకులు ఇందుకు సన్నాహాల్లో ఉన్నారు. ఈ ప్రదర్శనలో భారతరత్న అటల్ బిహారి వాజపేయి, ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్‌టాటా విగ్రహాలతోపాటు స్టైలిష్ స్టిల్‌తో తయారుచేసిన సింహం, పులి, జామెంట్రిక్ షేప్‌తో రూపొందించిన జింక, త్రీడీ టెక్నాలజీతో చేసిన ఎలిఫెంట్ ఫైట్, స్టాట్యూ ఆఫ్ లిబర్టీ, సెల్ఫ్ మేడ్ పర్సన్ విగ్రహాలను ప్రదర్శిస్తున్నట్టు ‘కళారత్న’ కాటూరి వెంకటేశ్వరరావు, రవిచంద్ర, శ్రీహర్ష శనివారం విలేకరులకు తెలియజేశారు.
చేబ్రోలు: ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ గుంటూరు జిల్లా మహాసభలు ఆదివారం ఉదయం చేబ్రోలులోని ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు ఫెడరేషన్ జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు తెలిపారు. మహాసభల ఏర్పాట్లను శనివారం యూటీఎఫ్ నాయకులు పర్యవేక్షించారు. జిల్లా కార్యదర్శి జి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఈ మహాసభలకు ముఖ్య అతిథులుగా విద్యావేత్త, మాజీ ఎమ్మెల్సీ కె ఎస్ లక్ష్మణరావు, యూటీఎఫ్ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొంటారన్నారు. ఉదయం 9 గంటలకు జెండా ఆవిష్కరణతో మహాసభలు ప్రారంభం కానున్నాయని, చేబ్రోలు ప్రధాన రహదారిలో ర్యాలీ నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా మహాసభలలో జిల్లా నలుమూలల నుంచి ఉపాధ్యాయులు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని చేబ్రోలు మండల కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు షేక్ ఖాదర్ బాషా, పి పార్థసారథి కోరారు.
నరసరావుపేట: ఉపాధ్యాయుల డివిజన్ స్థాయి క్రీడా పోటీలు శనివారం ప్రారంభమయ్యాయి. డిపార్ట్‌మెంట్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ పల్నాడు జిల్లా ఆధ్వర్యంలో 2025–26 విద్యా ఏడాదికి ఆదివారం వరకు కొనసాగనున్నాయి. పోటీలలో పురుషుల ఉపాధ్యాయులకు క్రికెట్ పోటీలు లూథరన్ హైస్కూల్ మైదానంలో నిర్వహించగా, మహిళా ఉపాధ్యాయులకు త్రో బాల్ పోటీలు శంకరభారతీపురం జెడ్పీ హైస్కూలులో నిర్వహించారు. టీడీపీ నాయకుడు డాక్టర్ రాంప్రసాద్, డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వరరావు ముఖ్య అతిథులుగా పాల్గొని క్రీడాకారులను ఉత్సాహపరిచారు. ఉపాధ్యాయుల్లో క్రీడాస్ఫూర్తిని పెంపొందించేందుకు ఇటువంటి పోటీలు ఎంతో దోహదం చేస్తాయని వారు తెలిపారు.
బాపట్లటౌన్: హెల్మెట్ లేకుండా ప్రయాణిస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ బి.ఉమామహేశ్వర్ తెలిపారు. జిల్లా వ్యాప్తంగా హెల్మెట్ వినియోగంపై శనివారం ప్రత్యేక డ్రైవ్ నిర్వహించారు. వాహన చోదకులకు హెల్మెట్ వాడకంపై అవగాహన కల్పించారు. ఎస్పీ బి.ఉమామహేశ్వర్ మాట్లాడుతూ హెల్మెట్ బరువు కాదు, అది మీ ప్రాణానికి రక్షణ కవచంలాంటిదన్నారు. ద్విచక్ర వాహనాలపై ప్రయాణించే వారు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. ద్విచక్ర వాహనదారుల్లో హెల్మెట్ ధారణతోపాటు రోడ్డు భద్రతపై అవగాహన పెంపొందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టామని ఆయన వివరించారు.
తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ ప్రదర్శనకు తె
తెలుగు వరల్డ్ ఆర్టిస్ట్స్ ఆర్ట్ సొసైటీ ప్రదర్శనకు తె


