బాల్యవివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలి
గుంటూరు వెస్ట్: గుంటూరు బాల్య వివాహాల రహిత జిల్లాగా ఆవిష్కృతం కావాలని జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా పిలుపునిచ్చారు. గురువారం స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో సమావేశ మందిరంలో బాల్య వివాహ ముక్త్ భారత్ (బి.వి.ఎం.బి) కార్యక్రమంపై వందరోజుల ప్రచార కార్యక్రమ జిల్లా స్థాయి కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దీనికోసం అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలని, ప్రజలను భాగస్వామ్యం చేసుకోవాలన్నారు. బాల్య వివాహాలు వలన కలిగే అనర్థాలను తల్లిదండ్రులు గ్రహించాలని చెప్పారు. బాల్య వివాహాలు లేని సమాజం పురోగతి సాధిస్తుందన్నారు. తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలని సూచించారు. అనంతరం కలెక్టర్ ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ పి. ప్రసూన, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.విజయలక్ష్మీ, గుంటూరు నగర పాలక సంస్థ ఉప కమిషనర్ శ్రీనివాసరావు, తెనాలి మున్సిపల్ కమిషనర్ జె. రామఅప్పలనాయుడు, జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి యు. చెన్నయ్య, జిల్లా గిరిజన సంక్షేమ, సాధికారత అధికారి పి.మురళీధర్, కార్మిక శాఖ ఉప కమిషనర్ ఎ. గాయత్రిదేవి బాల్య వివాహాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేశారు.
జిల్లా కలెక్టర్ ఎ.తమీమ్ అన్సారియా


