స్కేటింగ్ పోటీల్లో బాలుడి ప్రతిభ
మంగళగిరి టౌన్: విశాఖపట్నం ఉడా పార్కులో రోలర్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో ఈనెల 5 నుంచి జరుగుతున్న జాతీయ స్కేటింగ్ పోటీల్లో బాలుడు ప్రతిభ చాటాడు. మండల పరిధిలోని చినకాకాని గ్రామానికి చెందిన సుంకర ధరణీశ్వర్ 10 నుంచి 12 సంవత్సరాలలోపు జరిగిన ఇన్‌లైన్ స్కేటింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో స్కేటింగ్ స్పీడ్ స్లాలోమ్, క్లాసిగ్ స్పీడ్ స్లాలోమ్‌లో పోటీపడ్డాడు. స్పీడ్ స్లాలోమ్‌లో సిల్వర్ మెడల్ సాధించాడు. ఆంధ్రప్రదేశ్ రోలర్ స్కేటింగ్ అసోసియేషన్ తరఫున రాష్ట్రం నుంచి ధరణీశ్వర్ పోటీల్లో పాల్గొన్నాడు. ఇప్పటి వరకు జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో నిర్వహించిన స్కేటింగ్ పోటీల్లో వివిధ విభాగాల నుంచి 11 మెడల్స్ సాధించాడు. ధరణీశ్వర్‌ను అకాడమి కార్యదర్శి శీలం లక్ష్మణ్, కోచ్ సింహాచలం, హైకోర్టు అడ్వకేట్ సుంకర చరణ్ అభినందించారు.
బి.ఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల
ఏఎన్‌యూ(పెదకాకాని): ఈ ఏడాది సెప్టెంబరు నెలలో జరిగిన బి.ఫార్మసీ ఐదవ సెమిస్టర్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు విడుదల చేసినట్లు ఏఎన్‌యూ ఎగ్జామినేషన్స్ కంట్రోలర్ ఆలపాటి శివ ప్రసాద్ తెలిపారు. మొత్తం పరీక్షకు 370 మంది హాజరు కాగా 211 మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు ఈనెల 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తులను ఈనెల 23వ తేదీలోగా పీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 ఫీజు చెల్లించాలన్నారు. ఈ ఏడాది అక్టోబరులో జరిగిన ఫార్మా.డి మొదటి సెమిస్టర్‌కు 285 మంది హాజరు కాగా వారిలో 194 మంది ఉత్తీర్ణులయ్యారన్నారు. రీవాల్యుయేషన్‌కు 22వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని, 23వ తేదీలోగా ఫీజీ కో–ఆర్డినేటర్ కార్యాలయంలో అందజేయాలన్నారు. ఒక్కొక్క సబ్జెక్ట్‌కు రూ.2070 చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలియజేశారు.


