బీజేపీ జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ రాధామాధవి
గుంటూరు మెడికల్: బీజేపీ మహిళా మోర్చా గుంటూరు జిల్లా అధ్యక్షురాలిగా డాక్టర్ శనక్కాయల రాధా మాధవిని పార్టీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు చెరుకూరి తిరుపతిరావు ప్రకటించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కార్యాలయంలో గురువారం జరిగిన కార్యక్రమంలో నియామక పత్రాన్ని అందజేశారు. తిరుపతిరావు మాట్లాడుతూ గుంటూరు జిల్లాలో మహిళా మోర్చా కార్యకలాపాలను మరింత బలోపేతం చేసి, పార్టీ అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. డాక్టర్ శనక్కాయల రాధా మాధవి మాట్లాడుతూ పార్టీ ఇచ్చిన బాధ్యతను శక్తివంచన లేకుండా నిర్వర్తిస్తానని తెలిపారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు యడ్లపాటి స్వరూపరాణి, బీజేపీ సీనియర్ నాయకుడు కొత్తూరు వెంకట సుబ్బారావు మాట్లాడారు. కార్యక్రమంలో తులసి రామచంద్ర ప్రభు, కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వైవీ సుబ్బారావు, నాగమల్లేశ్వరి యాదవ్, జిల్లా ప్రధాన కార్యదర్శులు తోట శ్రీనివాస్, బజరంగ్ రామకృష్ణ, జిల్లా కార్యదర్శి కె.నారాయణరెడ్డి, మాజీ జిల్లా కార్యదర్శి దుర్గా భవాని, కోలా రేణుక, మూడో మండల మహిళా అధ్యక్షురాలు బెహరా గాయత్రి, మాజీ కార్పొరేటర్ శ్రావణకుమారి, చావలి పద్మ, రావూరి లక్ష్మీ విమలాదేవి, కె.రేణుక, కె. విజయలక్ష్మి, వాణి త్రిపురమల్లు, కె.శ్రీదుర్గ పాల్గొన్నారు.


