అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు
తెనాలి రూరల్: 44 ఏళ్ల క్రితం నాటి సివిల్ వ్యాజ్యంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1981 సంవత్సరానికి సంబంధించి పార్టీషన్ పిటిషన్ (ఓఎస్ నెంబరు 135/1981) పెండింగ్‌లో ఉంది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన సూరపనేని సూరమ్మ తనకు వారసత్వంగా ఉన్న ఆస్తిలో హక్కు ఉందంటూ 1981లో కోర్టును ఆశ్రయించారు. ప్రతి వాదిగా సూరపనేని వెర్రెమ్మ ఉన్నారు. వాది, ప్రతివాది, వీరు 1981లో పెట్టుకున్న న్యాయవాదులూ మృతి చెందారు. వీరి తరఫున వారసులు కేసును కొనసాగిస్తూ వచ్చారు. తెనాలి న్యాయచరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి ఎం. శ్రీధర్.. సూరమ్మకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సూరమ్మ తరఫున మాదినేని రాంప్రసాద్ వాదించారు. .
నగరంపాలెం(గుంటూరు ఈస్ట్) : గుంటూరులోని లక్ష్మీపురం ఆనం మెడికల్ హబ్ వద్ద శ్రీధర్మశాస్త్ర అయ్యప్పస్వామి మహా పడిపూజ మహోత్సవాన్ని వైభవంగా నిర్వహించారు. రెండు రోజులుగా నిర్వహిస్తోన్న పడిపూజ శుక్రవారం తెల్లవారుజామున ముగిసింది. శబరిమల ఆచారం ప్రకారం పూజలు, అభిషేకాలు నిర్వహించారు. గురుస్వామి ఏ.శ్రీనివాసన్ నాయర్ నేతృత్వంలో పూజలు చేపట్టగా, సంతోష్ స్వామి బృందం అయ్యప్ప, భవానీ పూజలను భక్తితో నిర్వహించారు. వందలాది మంది భక్తులకు పూజ కార్యక్రమాల అనంతరం తీర్థప్రసాదాలు అందించారు. పడిపూజ మహోత్సవం లో సీనియర్ వైద్యులు ఆర్.మురళీబాబురావు, బీవీ.సుధీర్‌బాబు, వంశీకృష్ణ, శ్రీబాలసుధ డయాగ్నస్టిక్స్ నిర్వాహాకులు ఆనం సంజీవరెడ్డి, బాలబాణి, వైద్యులు ఆనం గోపాల్‌రెడ్డి, నర్మదాసాయి, లక్ష్మీరెడ్డి, రెడ్డి అంకమ్మరెడ్డి, వంగా సుబ్బారెడ్డి పాల్గొన్నారు.
తెనాలి: పెనుగొండ క్షేత్ర పీఠాధిపతి శ్రీప్రజ్ఞానంద సరస్వతి (బాలస్వామీజీ) ఆధ్వర్యంలో బుర్రిపాలెం రోడ్డులో సువర్ణభారతి క్షేత్ర సరస్వతీ దేవాలయం నిర్మాణ పనులకు శుక్రవారం అంకురార్పణ చేశారు. నీటిపంపు వేయటం ద్వారా గంగ పూజిత పనులను అక్కడ ఆరంభించారు. మహిళలతో లలితా సహస్ర పారాయణం, విష్ణుసహస్ర పారాయణం, హ నుమాన్ చాలీసా పారాయణం చేయించారు. భక్తులచే ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో శ్రీసాలిగ్రామ మఠం ట్రస్ట్ సంయుక్త కార్యదర్శి ముద్దాభక్తుని రమణయ్య, గోపు రామకష్ణ, రావూరి సుబ్బారావు, గొడవర్తి సాయి హరేరామ్, మాజేటి గోపి పాల్గొన్నారు.
44 ఏళ్ల వ్యాజ్యంలో తీర్పు ఇచ్చిన న్యాయమూర్తి
తెనాలి రూరల్: 44 ఏళ్ల క్రితం నాటి సివిల్ వ్యాజ్యంలో న్యాయమూర్తి తీర్పు ఇచ్చారు. గుంటూరు జిల్లా తెనాలి ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో 1981 సంవత్సరానికి సంబంధించి పార్టీషన్ పిటిషన్ (ఓఎస్ నెంబరు 135/1981) పెండింగ్‌లో ఉంది. దుగ్గిరాల మండలం మంచికలపూడి గ్రామానికి చెందిన సూరపనేని సూరమ్మ తనకు వారసత్వంగా ఉన్న ఆస్తిలో హక్కు ఉందంటూ 1981లో కోర్టును ఆశ్రయించారు. ప్రతి వాదిగా సూరపనేని వెర్రెమ్మ ఉన్నారు. వాది, ప్రతివాది, వీరు 1981లో పెట్టుకున్న న్యాయవాదులూ మృతి చెందారు. వీరి తరఫున వారసులు కేసును కొనసాగిస్తూ వచ్చారు. తెనాలి న్యాయచరిత్రలోనే అత్యంత ఎక్కువ కాలం పెండింగ్‌లో ఉన్న ఈ కేసును శుక్రవారం విచారించిన న్యాయమూర్తి ఎం. శ్రీధర్.. సూరమ్మకు అనుకూలంగా తీర్పు చెప్పారు. సూరమ్మ తరఫున మాదినేని రాంప్రసాద్ వాదించారు.
అమరేశ్వరాలయంలో కాలభైరవస్వామికి పూజలు


