అటకెక్కిన డెత్ ఆడిట్
న్యూస్‌రీల్
డెత్ ఆడిత్ ఎంతో కీలకం
డెత్ ఆడిట్‌తో మరోసారి అలాంటి మరణాలు సంభవించకుండా జాగ్రత్తలు తీసుకోవచ్చు. ఆస్పత్రితో పాటు వైద్యులు, సిబ్బంది లోపాలను చెక్ చేసుకుని వాటిని సరిచేసి, మరో మరణం సంభవించకుండా నివారించవచ్చు. రోగి బంధువులకు కూడా సందేహాలు తొలగిపోతాయి. నెగిటివ్ ఆలోచన లేకుండా మరణంపై ఆందోళనలు చేయకుండా ఇళ్లకు వెళ్తారు. ఇంత కీలకమైన డెత్ ఆడిట్‌ను ఆస్పత్రి అధికారులు చేయకుండా మిన్నకుండి పోతున్నారు.
ప్రతిరోజూ 20కి పైగా మరణాలు
గుంటూరు జీజీహెచ్‌లో ప్రతిరోజూ చికిత్స పొందుతూ 20 మందికి పైగా రోగులు చనిపోతున్నారు. కొంత మంది వైద్య విభాగాధిపతులు మొక్కుబడిగా వార్డుల్లో డెత్ ఆడిట్ చేస్తున్నామంటూ సమావేశాలు నిర్వహించి చేతులు దులుపుకుంటున్నారు. మరణాల తగ్గింపులో కీలకమైనది ఇన్‌ఫెక్షన్ కంట్రోల్. గతంలో ప్రతినెలా కమిటీ సమావేశాలు నిర్వహించి తగ్గించేందుకు ప్రణాళిక సిద్ధం చేసేది. ఐసీయూ, ఎన్‌ఐసీయూ వంటి కీలక వైద్య విభాగాల్లో ఇన్‌ఫెక్షన్ కంట్రోల్‌లో ఉంచడం ద్వారా మరణాలను చాలా వరకు తగ్గించ్చవచ్చు. ఆసుపత్రి అధికారులు ఇప్పటికై నా స్పందించి డెత్ ఆడిట్, ఇన్‌ఫెక్షన్ కంట్రోల్ కమిటీ సమావేశాలు నిర్వహించి మరణాల తగ్గింపునకు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.
అమ్మవారికి బంగారు హారం
వెంకయ్య స్వామి ఆరాధన
నరేంద్ర స్వామికి అన్నాభిషేకం
గుంటూరు
ఆదివారం శ్రీ 16 శ్రీ నవంబర్ శ్రీ 2025
విజయపురిసౌత్: నాగార్జున సాగర్ జలాశయ నీటి మట్టం శనివారం 586.80 అడుగులకు చేరింది. ఇది 304.4680 టీఎంసీలకు సమానం. కుడి కాలువకు 10,000, ఎడమ కాలువకు 3,374, ఎస్‌ఎల్‌బీసీకి 600, వరద కాలువకు 300 క్యూసెక్కులు విడుదలవుతోంది. దీంతో సాగర్ జలాశయం నుంచి మొత్తం ఔట్‌ఫ్లోగా 14,274 క్యూసెక్కులు విడుదలవుతోంది. శ్రీశైలం నుంచి సాగర్ జలాశయానికి 14,274 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది.
7
కొల్లూరు: కొల్లూరుకు చెందిన బలిజేపల్లి విష్ణుమూర్తి, రామలక్ష్మిల కుమారుడు, కోడలు గోపికృష్ణ, సత్యశ్రీలు పార్వతీ అమ్మవారికి రూ. 1.75 లక్షలు విలువైన బంగారు హారం సమర్పించారు.
వేమూరు(చుండూరు): చుండూరులో భగవాన్ వెంకయ్యస్వామి ఆరాధన మహోత్సవా లు శనివారం నిర్వహించినట్టు ఆశ్రమ నిర్వాహకులు పురి శ్రీనివాసరెడ్డి తెలిపారు.
పెదపులివర్రు(భట్టిప్రోలు): పెదపులివర్రులో శనివారం ఏకాదశి సందర్భంగా శ్రీ బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ రాజరాజ నరేంద్ర స్వామికి అన్నాభిషేకం నిర్వహించారు.
అటకెక్కిన డెత్ ఆడిట్
అటకెక్కిన డెత్ ఆడిట్
అటకెక్కిన డెత్ ఆడిట్
అటకెక్కిన డెత్ ఆడిట్
అటకెక్కిన డెత్ ఆడిట్


