ప్రతి గడపకు సంక్షేమ పథకాలు
కార్యకర్తలు ఇచ్చే భరోసా ఎనలేనిది
● మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్
● పాత గుంటూరులో ముస్లిం
మైనార్టీల ఆత్మీయ సమావేశం
పట్నంబజారు(గుంటూరు ఈస్ట్): వైఎస్సార్ సీపీ ఈసారి అధికారంలోకి రాగానే కార్యకర్తల ద్వారానే ప్రతి గడపకు సంక్షేమం, ప్రతి గ్రామాన అభివృద్ధి జరుగుతోందని వైఎస్సార్ సీపీ తెనాలి నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్ స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధికార ప్రతినిధిగా నియమితులైన పఠాన్ అబ్దుల్లా ఖాన్ ఆధ్వర్యంలో శనివారం పాతగుంటూరులోని అంజుమన్ షాదీఖానాలో ముస్లిం మైనార్టీల ఆత్మీయ సమావేశం, సత్కార సభ నిర్వహించారు. సభకు పార్టీ మైనార్టీ విభాగం తూర్పు నియోజకవర్గ అధ్యక్షుడు లియాఖత్ అలి అధ్యక్షత వహించారు.
● అన్నాబత్తుని శివకుమార్ మాట్లాడుతూ పార్టీలో క్యాడర్‌కు ఎలాంటి కష్టం వచ్చినా, ఎంత వరకు వచ్చేందుకై నా వెనుకాడేది లేదని చెప్పారు. గతంలో జరిగిన ప్రతి తప్పును సరిదిద్దుకుని ముందుకు వెళుతున్నామని వివరించారు. రాష్ట్రంలో ఏ ఒక్క ముఖ్యమంత్రి అందజేయని సంక్షేమాన్ని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వై.ఎస్.జగన్‌మోహన్‌రెడ్డి అందజేశారన్నారు. చంద్రబాబు మాటలు నమ్మి ఓట్లు వేసిన ప్రతి ఒక్కరూ ఈరోజున మరోసారి మోసపోయామని అర్ధం చేసుకున్నారన్నారు.
వై.ఎస్.జగన్ 2.0 కార్యకర్తలకు
ధైర్యం నింపుతోంది
● వైఎస్సార్‌సీపీ పొన్నూరు సమన్వయకర్త అంబటి మురళీకృష్ణ మాట్లాడుతూ వై.ఎస్. జగన్ 2.0 పాలన పూర్తిస్థాయిలో కార్యకర్తల్లో ఎనలేని ధైర్యాన్ని నింపుతుందన్నారు. కంటికి రెప్పలా ప్రతి కార్యకర్తను కాపాడుకుంటామని, కాపాడాల్సిన బాధ్యత మనపైనే ఉందన్న విషయాన్ని ప్రతిరోజూ జగనన్న చెప్పారన్నారు. రాష్ట్రంలో ఒక నిరంకుశత్వ పాలన కొనసాగుతోందని, కేవలం వైఎస్సార్‌సీపీ నేతలు, కార్యకర్తలను టార్గెట్‌గా చేసుకుని చంద్రబాబు ప్రభుత్వం ముందుకు సాగుతోందన్నారు.
చంద్రబాబు ప్రభుత్వం ఉనికి కోల్పోతోంది
● తాడికొండ సమన్వయకర్త వనమా బాలవజ్రబాబు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం ప్రజల్లో ఉనికి కోల్పోతుందని చెప్పారు. ఈరోజున ప్రతిపక్షంలో ఉన్న మనం పేదల పక్షాన పోరాడాల్సిన అవసరం ఉందన్నారు. పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ వారి బాధ్యతలు గుర్తెరిగి నిత్యం ప్రజలతో మమేకమవ్వాలని, వారి సమస్యలు నాయకుల దృష్టికి తీసుకొచ్చి పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు.
ప్రతి ఒక్కరికి రుణ పడి ఉంటా
● వైఎస్సార్‌సీపీ జిల్లా అధికారప్రతినిధి పఠాన్ అబ్దుల్లా ఖాన్ మాట్లాడుతూ తనపై నమ్మకంతో ఇచ్చిన పదవిని బాధ్యతగా ముందుకు తీసుకెళతానన్నారు. పార్టీ నాయకులు, కార్యకర్తలతో మమేకమై పాటుపడతానన్నారు. జిల్లాలోని సమస్యలు తెలుసుకుని ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తల దృష్టికి తీసుకెళ్లడంతోపాటు, వైఎస్సార్‌సీపీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమంలో ముందుండి నడుస్తామన్నారు.
కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు పఠాన్ సైదా ఖాన్, పార్టీ ఉపాధ్యక్షుడు నందేటి రాజేష్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు ఆళ్ల ఉత్తేజ్‌రెడ్డి, అఖిల భారతీయ వడ్డెర సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు పల్లపు మహేష్, పార్టీ నేతలు సలీం, జాఫర్, రామయ్య, సత్యం, శివన్నారాయణ, స్వర్ణ, శ్రీకాంత్‌రెడ్డి, అనుబంధ విభాగాల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులు, తదితరులు పాల్గొన్నారు.
వైఎస్సార్‌సీపీ గుంటూరు నగర అధ్యక్షురాలు, తూర్పు నియోజకవర్గ సమన్వయకర్త షేక్ నూరిఫాతిమా మాట్లాడుతూ కార్యకర్తలు ఇచ్చే భరోసా నాయకులు వేసే ప్రతి అడుగులోనూ ఎంతో ధైర్యాన్ని కల్పిస్తుందని చెప్పారు. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముస్లిం మైనార్టీలకు నాలుగు శాతం రిజర్వేషన్ కల్పిస్తే, వై.ఎస్.జగనన్న మరో రెండు అడుగులు ముందుకు వేసి మైనార్టీలకు ఎనలేని సంక్షేమాన్ని అందజేశారన్నారు.


