మార్కెట్ కమిటీలు డీలా..
కొరిటెపాడు(గుంటూరు): వివిధ రకాల ఫీజుల వసూలులో మార్కెట్ కమిటీలు డీలా పడ్డాయి. జిల్లాలోని తెనాలి, దుగ్గిరాల, గుంటూరు, పొన్నూరు, ప్రత్తిపాడు మార్కెట్ యార్డుల పరిస్థితి కొంత మేర మెరుగ్గానే ఉన్నా.. మిగిలిన తాడికొండ, ఫిరంగిపురం, మంగళగిరి మార్కెట్ కమిటీలు బాగా వెనుకబడ్డాయి..
● గుంటూరు జిల్లాలో ఉన్న 8 మార్కెట్ కమిటీలు, వాటి పరిధిలో ఉన్న 15 చెక్ పోస్టుల ద్వారా ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి వివిధ రకాల ఫీజులు, అద్దెలు, సంతల ద్వారా రూ.146.31 కోట్లు వసూలు చేయాలని దిశానిర్దేశనం చేశారు.
● అక్టోబర్ నెల చివరి నాటికి అంటే ఏడు నెలల కాలానికి 37.38 శాతంతో రూ.54.69 కోట్లు వసూలయ్యాయి.
● రూ.42.91 కోట్లు గుంటూరు మార్కెట్ కమిటీ నుంచి వసూలు కాగా, మిగిలిన ఏడు మార్కెట్ కమిటీల ద్వారా కేవలం రూ.11.78 కోట్లు వసూలు కావడం పరిశీలించదగిన అంశం.
● గుంటూరు మార్కెట్ కమిటీ లక్ష్యం రూ.115 కోట్లు కాగా ఇప్పటి వరకు 37.31 శాతంతో రూ.42.91 కోట్లు సాధించారు.
● తెనాలి లక్ష్యం 7.65 కోట్లు కాగా 47.45 శాతంతో రూ.3.63 కోట్లు వసూలు చేసి అగ్రస్థానంలో కొనసాగుతోంది.
● దుగ్గిరాల లక్ష్యం 3.75 కోట్లు కాగా 42.72 శాతంతో రూ.1.60 కోట్లు, పొన్నూరు లక్ష్యం రూ.8.38 కోట్లు కాగా 40.13 శాతంతో రూ.3.36 కోట్లు వసూలు చేసింది.
● ప్రత్తిపాడు లక్ష్యం రూ.4.45 కోట్లు కాగా 37.82 శాతంతో రూ.1.68 కోట్లు, ఫిరంగిపురం లక్ష్యం రూ.1.88 కోట్లు కాగా 19.53 శాతంతో రూ.0.37 కోట్లు మాత్రమే వసూలు చేశాయి.
● మంగళగిరి లక్ష్యం రూ.3.03 కోట్లు కాగా 33.96 శాతంతో రూ.1.03 కోట్లు, తాడికొండ లక్ష్యం రూ.2.17 కోట్లు కాగా 5 శాతంతో రూ.0.11 కోట్లు మాత్రమే వసూలు చేశాయి.
● గత ఏడాది ఇదే సమయానికి రూ.65.94 కోట్లు మార్కెట్ ఫీజు వసూలు చేయగా, ఈ ఏడాది రూ.54.69 కోట్లు మాత్రమే వసూలు చేయడం గమనార్హం.
● గత ఆర్థిక సంవత్సరం కన్నా ఈ ఏడాది మార్కెట్ ఫీజు వసూలు రూ.11.25 కోట్లు తగ్గడం విశేషం.
● లక్ష్య సాధన దిశగా నడిపించడంలో ఆర్జేడీ, డీడీఎం, ఏడీఎంలు ఉదాసీనంగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
ఫీజు వసూలులో వెనుకంజ
తెనాలి, దుగ్గిరాల, గుంటూరు,
పొన్నూరు, ప్రత్తిపాడు మార్కెట్
యార్డుల పరిస్థితి కొంత మెరుగు
మిగిలిన తాడికొండ, ఫిరంగిపురం,
మంగళగిరి మార్కెట్ కమిటీలలో
తగ్గిన వసూళ్లు
ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి
ఫీజులు, అద్దెలు, సంతల ద్వారా
రూ.146.31 కోట్లు వసూలు
చేయాలని దిశానిర్దేశం