గుంటూరు రూరల్: నల్లపాడులోని శ్రీ అగస్తేశ్వరాలయంలో శనివారం కార్తిక బహుళ ఏకాదశి సందర్భంగా ప్రత్యేక పూజలు చేశారు. ఆలయంలో స్వామివారికి అభిషేకాలు, హోమాలు, నిర్వహించారు. స్వామికి ప్రత్యేక అలంకారం చేసి భక్తులకు దర్శనం కల్పించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ అర్చకుడు పవన్‌కుమార్ శర్మ మాట్లాడుతూ ఆదివారం ఆలయ ప్రాంగణంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నారని ఈ అవకాశాన్ని భక్తులు సద్వినియోగించుకోవాలని కోరారు
తెనాలి అర్బన్: అవకాశాలను అందిపుచ్చుకుంటూ ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెనాలి ప్రభుత్వ ఐటీఐ కళాశాల ప్రిన్సిపల్ రావి చిన వెంకటేశ్వర్లు పేర్కొన్నారు. రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ సహకారంతో చినరావూరులోని ప్రభుత్వ ఐటీఐ కళాశాలలో శనివారం మెగా జాబ్ మేళా నిర్వహించారు. మేళాలో 250 మంది విద్యార్థులు పాల్గొనగా 108 మంది వివిధ కంపెనీల్లో ఎంపికై నట్లు ఆయన తెలిపారు. మొత్తం 14 కంపెనీలకు చెందిన ప్రతినిధులు పాల్గొని విద్యార్థులను ఎంపిక చేసుకున్నారని చెప్పారు. వీరిలో మొదటి విడత కింత 30 మందికి నియామక పత్రాలు అందజేశారు. మిగిలిన వారికి త్వరలో నియామక పత్రాలు అందజేయనున్నట్లు వివరించారు.
గుంటూరు ఎడ్యుకేషన్: ఇండియన్ రెడ్‌క్రాస్ సొసైటీ రాష్ట్ర వైస్ చైర్మన్‌గా గుంటూరు నగరానికి చెందిన పి.రామచంద్రరాజు బాధ్యతలు స్వీకరించారు. శనివారం విజయవాడలోని రెడ్‌క్రాస్ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యవర్గ సమావేశంలో భాగంగా సభ్యులు రామచంద్రరాజును వైస్ చైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆయన గుంటూరు జిల్లా రెడ్‌క్రాస్ వైస్ చైర్మన్‌గా, భారతీయ విద్యాభవన్ కార్యదర్శిగా, శ్రీవేంకటేశ్వర విజ్ఞాన మందిరం ట్రస్ట్ కార్యదర్శిగా వివిధ హోదాల్లో సేవలందిస్తున్నారు.
తెనాలిటౌన్: చీకటి నుంచి వెలుగుకు మనలోని జ్ఞాన జ్యోతిని వెలిగించేందుకు దీపారాధన దోహదపడుతుందని శరణగతి గోష్టి పీఠాధిపతి రామానుజ దాస స్వామిజీ పేర్కొన్నారు. హిందూ చైతన్య వేదిక ఆధ్వర్యంలో తెనాలిలో శనివారం హిందూ మహిళ దీపోత్సవ కార్యక్రమంగా 1008 మహిళలతో శోభాయాత్ర నిర్వహించారు. పీఠాధిపతి నరేంద్ర రామనుజ దాస స్వామి పాల్గొని కార్తికమాసం విశిష్టతను తెలియజేశారు. ఎం.శ్రీనివాసరెడ్డి, అంబటి మారుతీరామ్, ఎస్వీ కనకదుర్గ, కె.రమాదేవి, తదితరులు పాల్గొన్నారు.
తాడేపల్లిరూరల్: గుంటూరు జిల్లా సీతానగరం విజయకీలాద్రి దివ్యక్షేత్రంపై కార్తిక మాసాన్ని పురస్కరించుకుని భక్తులు శనివారం దీపాలు వెలిగించారు. ఈ సందర్భంగా జీయర్ ఎడ్యుకేషనల్ ట్రస్ట్ మేనేజర్ పురాణం వెంకటాచార్యులు మాట్లాడుతూ శ్రీ భూ వరాహస్వామికి అభిషేక మహోత్సవం అనంతరం భూ వరాహ హోమాలు అంగరంగ వైభవంగా నిర్వహించామని తెలిపారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామి వారిని దర్శించుకుని అన్న ప్రసాదాలు స్వీకరించారని తెలిపారు.
అగస్తేశ్వరాలయంలో ఏకాదశి పూజలు
అగస్తేశ్వరాలయంలో ఏకాదశి పూజలు
అగస్తేశ్వరాలయంలో ఏకాదశి పూజలు


