పలు రైళ్లు రద్దు
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్):
గుంటూరు రైల్వే డివిజన్ పరిధిలో పలు రైళ్ళను తాత్కాలికంగా రద్దు చేయడం జరిగిందని పీఆర్‌ఓ
వినయ్‌కాంత్ మంగళవారం తెలిపారు. రైలు నంబర్ 67236 తెనాలి–గుంటూరు, 67230 గుంటూరు–విజయవాడ, 67249 గుంటూరు–రేపల్లె, 67250 రేపల్లె–గుంటూరు, 67228 మాచర్ల– విజయవాడ, 67238 రేపల్లె–మార్కాపురం, 67239 మార్కాపురం– తెనాలి ప్యాసింజర్ రైళ్ళు, రైలు నంబర్ 17244 రాయగడ–గుంటూరు ఎక్స్‌ప్రెస్, 07166 భువనేశ్వర్–సికింద్రాబాద్, 18464 బెంగళూరు–భువనేశ్వర్, 17256 లింగంపల్లి–నర్సాపూర్, 17216 ధర్మవరం–మచిలీపట్నం, 12805 విశాఖ–లింగంపల్లి , 17282 నర్సాపూర్–గుంటూరు రైళ్లు ఈనెల 29వ తేదీన తాత్కాలిక రద్దు చేయడం జరిగిందని తెలిపారు.


