నిజాయతీతో అత్యున్నత ప్రమాణాలు పాటించాలి
లక్ష్మీపురం(గుంటూరు వెస్ట్): రైల్వే సిబ్బంది నిరంతరం నిజాయతీతో పాటు అత్యున్నత ప్రమాణాలు పాటించాలని గుంటూరు రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్ పిలుపునిచ్చారు. పట్టాభిపురంలోని డీఆర్‌ఎం కార్యాలయంలో విజిలెన్స్ అవగాహన వారోత్సవాలను సోమవారం ప్రారంభించారు. ఆమె మాట్లాడుతూ అక్టోబర్ 27 నుంచి నవంబర్ 2వ తేదీ వరకు విజిలెన్స్ ఎవేర్‌నెస్ వీక్‌ను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించడం ఆనవాయితీగా వస్తుందని పేర్కొన్నారు. మన దేశ ఆర్థిక, రాజకీయ, సామాజిక పురోగతికి అవినీతి ఒక ప్రధాన అడ్డంకి ఉందని అభిప్రాయపడ్డారు. ప్రభుత్వం, పౌరులు, ప్రైవేట్ రంగం వంటి అన్ని వాటాదారులు అవినీతిని నిర్మూలించడానికి కలిసి పని చేయాలని పిలుపు నిచ్చారు. అవినీతికి వ్యతిరేకంగా పోరాటానికి మద్దతు ఇవ్వాలన్నారు. జీవితంలోని అన్ని రంగాలలో నిజాయతీ చట్ట నియమాలను పాటించాల్సిందగా కోరారు. అనంతరం వివిధ విభాగాల సిబ్బందితో అవినీతికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు.
రైల్వే డీఆర్‌ఎం సుథేష్ఠ సేన్


