
అట్రాసిటీ కేసుల్లో ఆలసత్వం ప్రదర్శిస్తున్న అధికారులు
నెహ్రూనగర్: ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో కొంత మంది పోలీసులు, అధికారులు అలసత్వం వహిస్తున్నారని, ఈ పద్ధతి మారాలని రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్ పేర్కొన్నారు. జవహర్ మిత్రమండలి ఆధ్వర్యంలో గుంటూరులోని ఎన్‌జీఓ కల్యాణ మండపంలో కెఎస్ జవహర్ దంపతులకు సత్కార సభ జరిగింది. ఆయన మాట్లాడుతూ ఎస్సీ కమిషన్ చెప్పినప్పటికీ పోలీసులు, ఇతర అధికారులు ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో నిర్లక్ష్యంగా వ్యవహారిస్తున్నారని దీనిపై త్వరలో సీఎస్‌ను కలిసి సమస్యను వివరిస్తామని చెప్పారు. అదే విధంగా ప్రభుత్వం తీసుకువచ్చిన జీఓ నంబర్ 19 వలన ఎస్సీ ఉద్యోగుల్లో తలెత్తుతున్న సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాన్నారు. కార్యక్రమంలో జెడ్పీ చైర్‌పర్సన్ కత్తెర హెనీ క్రిస్టినా, ఎమ్మెల్యేలు గల్లా మాధవి, బూర్ల రామాంజనేయులు, నక్కా ఆనందబాబు, లిడ్ క్యాప్ చైర్మన్ పిల్లి మాణిక్యరావు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్ర ఎస్సీ కమిషన్ చైర్మన్ కేఎస్ జవహర్