
బ్రాహ్మణ వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయం
తెనాలి: ఆంధ్రాప్యారిస్ తెనాలిలో నిర్వహిస్తున్న బ్రాహ్మణ ఉచిత వివాహ సమాచార కేంద్రం సేవలు శ్లాఘనీయమని రాష్ట్ర బ్రాహ్మణ సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు కామేశ్వర ప్రసాద్ అన్నారు. స్థానిక నూకల రామకోటేశ్వరరావు కళ్యాణ కళాసదనంలో ఆదివారం 15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయవేదిక జరిగింది. ఉదయం నుంచి సాయంత్రం వరకు జరిగిన సమావేశానికి సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి అధ్యక్షత వహించారు. ఐదు రాష్ట్రాల్నుంచి 750 కుటుంబాలవారు పాల్గొన్నారు. ముఖ్యఅతిథి కామేశ్వరప్రసాద్ వివాహవేదిక సమాచార పుస్తకాన్ని ఆవిష్కరించి ప్రసంగించారు. శాఖ భేదాన్ని చూడకుండా వివాహాలు జరుపుకోవాలని హితవు పలికారు. రాష్ట్రస్థాయిలో 15 పర్యాయాలు పరిచయ వేదికను తెనాలిలో నిర్వహించటం గొప్పగా ఉందన్నారు. సంఘ అధ్యక్షుడు దక్షిణామూర్తి మాట్లాడుతూ వైష్ణవి కేటరర్స్ హైదరాబాద్, బ్రాహ్మణ పరిషత్, వివిధ బ్రాహ్మణ సంఘాలు, అర్చక సంఘాల సహకారంతో నిర్వహించినట్టు తెలిపారు. తెనాలిలో ప్రతి ఆదివారం ఉచిత సమాచార సేవలను అందిస్తున్నట్టు గౌరవ అధ్యక్షుడు ప్రకాష్‌రావు చెప్పారు. సమాచార వేదికను ఏర్పాటుచేసిన సూర్యప్రకాశరావు, సుబ్బారావు సత్యబాబు, రామ్మోహనరావు ఆశయానికి అనుగుణంగా సేవలు అందిస్తున్నట్టు కోశాధికారి రాజేంద్రప్రసాద్ చెప్పారు. వివిధ విభాగాల ద్వారా బ్రాహ్మణులకు, బ్రాహ్మణ సంఘాలకు సేవలు అందిస్తున్న ప్రముఖులను సత్కరించారు. ఏపీపీఎస్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి వేదం హరిప్రసాద్, నెల్లూరు హైదరాబాదు ప్రాంతాల ప్రతినిధులు ఉమాదేవి, జయలక్ష్మి, విశ్వనాథం, మనవ రాము, కందాల సత్యనారాయణ, ప్రధాన కార్యదర్శి సత్యకుమార్, ఉపాధ్యక్షుడు ఆమంచి రాంబాబు, సంయుక్త కార్యదర్శి వేణుధర్, బీఎల్ సత్యనారాయణమూర్తి, పూర్ణ భాస్కర్, శ్రీనివాస్, కోదండ రామమూర్తి, వివిధ బ్రాహ్మణ సంఘాల ప్రతినిధులు సాయి, శ్రీనివాసమూర్తి, వేణుగోపాల్ పాల్గొన్నారు.
ఐదు రాష్టాల్నుంచి 750 కుటుంబాలు హాజరుకావటం విశేషం!
15వ రాష్ట్రస్థాయి బ్రాహ్మణ వధూవరుల పరిచయ వేదికలో రాష్ట్ర బ్రాహ్మణ
సంక్షేమ సమాఖ్య అధ్యక్షుడు
కామేశ్వర ప్రసాద్