
నేరాల నియంత్రణపై ప్రత్యేక దృష్టి
జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్
నగరంపాలెం: తెనాలి, దక్షిణ సబ్ డివిజన్ల పరిధిలో నేరాల నియంత్రణకు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ అన్నారు. నగరంపాలెంలోని జిల్లా పోలీస్ కార్యాలయ (డీపీఓ) ఆవరణలోని హాల్‌లో బుధవారం తెనాలి, దక్షిణ పోలీస్ సబ్ డివిజన్ల పోలీస్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ప్రతి పోలీస్‌స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్లపై క్షేత్రస్థాయిలో నిఘా ఉండాలని అన్నారు. కొత్తగా నేరాల జోలికి వెళ్లకుండా సరైన రీతిలో కౌన్సెలింగ్ చేయాలని ఆదేశించారు. ప్రజా ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. ఆయా సబ్ డివిజన్ల పరిధిలోని పోలీస్‌స్టేషన్లు, శాంతి భద్రతలు వంటి అంశాలపై జిల్లా ఎస్పీకి డీఎస్పీలు జనార్దన్ (తెనాలి), భానోదయ (దక్షిణ)లు వివరించారు.