
గతాన్ని మరిచిన బాలకృష్ణ
తాడికొండ: మెంటల్ సర్టిఫికెట్‌తో హత్యకేసు నుంచి బయటపడిన బాలకృష్ణ గతాన్ని మరిచి మాట్లాడటం దుర్మార్గమని, ఆయన నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడితే మంచిదని మాజీ ఎంపీ నందిగం సురేష్ అన్నారు. బెల్లంకొండ సురేష్‌పై బాలకృష్ణ ఎందుకు కాల్పులు జరపాల్సి వచ్చిందో ఓ సారి ఆత్మపరిశీలన చేసుకోవాలని సూచించారు. నాడు దిగంవత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి లేకపోతే నీ గతి ఏమై ఉండేదో ఆలోచించుకోవాలని, అప్పుడే నువ్వు జైలు పాలు అయ్యేవాడివనే గతాన్ని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదన్నారు. అప్పుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి కాళ్లు పట్టుకొనే నువ్వు కేసు నుంచి తప్పించుకున్నావని గుర్తుంచుకొని మాట్లాడితే మంచిదని, కక్షపూరిత రాజకీయాలు, అబద్ధపు హామీలు, మాటలు వైఎస్సార్ కుటుంబానికి లేవు, రావనే నిజం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని బాలకృష్ణ తెలుసుకుంటే మంచిదని హితవు పలికారు. గతాన్ని మర్చిపోయి బాలకృష్ణ ప్రవర్తించిన తీరుపై సినీనటుడు చిరంజీవి సైతం హుందాగా స్పందించారని, ప్రజా ప్రతినిధిగా ఉన్న బాలకృష్ణ తన వ్యాఖ్యలను ఉప సంహరించుకొని క్షమాపణ చెపితే మంచిదని లేదంటే నీకు ప్రజలే బుద్ధి చెబుతారన్నారు. మెంటల్ సర్టిఫికెట్ ఉన్న వ్యక్తులు అసెంబ్లీకి అనర్హులని, బాలకృష్ణ ముందు ఆ సంగతి తేల్చుకొని చట్టసభల్లో మాట్లాడాలని హెచ్చరించారు.
మాజీ ఎంపీ నందిగం సురేష్